హైదరాబాద్ కు ఆరోగ్యమంత్రి ఈటల రాజేందర్

హైదరాబాద్ కు ఆరోగ్యమంత్రి ఈటల రాజేందర్

హైదరాబాద్ :  నాంపల్లి అర్బన్ హెల్త్ సెంటర్లో చిన్న పిల్లల అస్వస్థత పై అధికారులతో మాట్లాడారు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్. నీలోఫర్ లో పిల్లలకు అందుతున్న చికిత్సపై వివరాలు తెల్సుకున్నారు. హుజారాబాద్ లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు స్వాగతం పలికిన తర్వాత… ఈటల రాజేందర్ హైదరాబాద్ కు బయల్దేరారు.

నాంపల్లి అర్బన్ హెల్త్ సెంటర్ లో బుధవారం వ్యాక్సినేషన్ తీసుకున్న 90 మంది చిన్నారుల్లో కొందరి ఆరోగ్యం విషమించింది. వీరిలో 15 మందికి నీలోఫర్ హాస్పిటల్ లో మరికొందరికి ప్రైవేటు హాస్పిటల్స్ లో చికిత్స ఇస్తున్నారు. నీలోఫర్ లో చికిత్సపొందుతుండగా 18 నెలల బాలుడు చనిపోయాడు. మరో ముగ్గురి పరిస్థితి సీరియస్ గా ఉందని తెలిసింది. వ్యాక్సినేషన్ తర్వాత వచ్చే నొప్పికి తప్పుడు మందులు ఇచ్చారని ఆరోపణలు వస్తున్నాయి.