కేంద్రం వెంటిలేటర్లు ఇచ్చినా.. అన్నీ అమర్చని అధికారులు

కేంద్రం వెంటిలేటర్లు ఇచ్చినా.. అన్నీ అమర్చని అధికారులు
  • తెలంగాణ వివరాలు వెల్లడించిన సెంట్రల్​ హెల్త్ మినిస్ట్రీ రిపోర్ట్‌‌‌‌‌‌‌‌

హైదరాబాద్, వెలుగు: కరోనా రోగుల చికిత్స కోసం తెలంగాణకు ఇచ్చిన1,708 వెంటిలేటర్లలో 143 వెంటిలేటర్లను ఇప్పటివరకు ఇన్‌‌‌‌‌‌‌‌స్టాల్ చేయలేదని కేంద్రం వెల్లడించింది. వెంటిలేటర్ల నిర్వహణ, ఇతర అవసరాలకు సరిపడా నిపుణులైన హెల్త్ స్టాఫ్‌‌‌‌‌‌‌‌ కూడా రాష్ట్రంలో లేరని పేర్కొంది. ఒమిక్రాన్ నేపథ్యంలో రెండ్రోజుల క్రితం అన్ని రాష్ట్రాల హెల్త్ సెక్రటరీలతో సెంట్రల్ హెల్త్ సెక్రటరీ వీడియో కాన్ఫరెన్స్‌‌‌‌‌‌‌‌ నిర్వహించారు. ఇందులో చర్చించిన అంశాలతో కేంద్రం రిపోర్ట్ రిలీజ్ చేసింది. తెలంగాణ సహా 12 రాష్ట్రాలు తాము ఇచ్చిన వెంటిలేటర్లను ఇన్‌‌‌‌‌‌‌‌స్టాల్‌‌‌‌‌‌‌‌ చేయలేదని, వాటి నిర్వహణకు సరిపడా హెల్త్ స్టాఫ్‌‌‌‌‌‌‌‌కు శిక్షణ ఇవ్వలేదని పేర్కొంది. వెంటిలేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కన్జూమబుల్స్ అందుబాటులో లేని 10 రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఒకటి. వెంటిలేటర్లను ఇన్‌‌‌‌‌‌‌‌స్టాల్ చేసి, హెల్త్ స్టాఫ్‌‌‌‌‌‌‌‌కు ట్రైనింగ్ ఇవ్వాలని సెంట్రల్​ఆఫీసర్లు సూచించారు.
డేటా పంపిస్తలే
కరోనా డేటాను సెంట్రల్ హెల్త్ పోర్టల్స్‌‌‌‌‌‌‌‌లో అప్‌‌‌‌‌‌‌‌లోడ్‌‌‌‌‌‌‌‌ చేయడంలోనూ కొన్ని రాష్ట్రాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని కేంద్రం అసంతృప్తి వ్యక్తం చేసింది. జిల్లాల వారీగా డేటాను పీఎంఎస్‌‌‌‌‌‌‌‌, ఓసీ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–ఐఎంఎస్ తదితర పోర్టల్స్‌‌‌‌‌‌‌‌లో అప్‌‌‌‌‌‌‌‌లోడ్ చేయాలని సూచిస్తున్నా 132 జిల్లాలు డేటాను అప్‌‌‌‌‌‌‌‌లోడ్ చేయడంలేదని పేర్కొంది. అత్యధికంగా తెలంగాణ నుంచే 33 జిల్లాలు ఉన్నాయని రిపోర్ట్‌‌‌‌‌‌‌‌లో తెలిపింది. దేశంలో ప్రతి పది లక్షల మందికి సగటున 11,155 టెస్టులు చేస్తుండగా తెలంగాణలో 10,911 టెస్టులు మాత్రమే చేస్తున్నట్టు వెల్లడించింది. ప్రతి పది లక్షల మందిలో కనీసం రోజుకు140 మందికి టెస్టులు చేయించాలని కేంద్రం సూచించగా, ఆసిఫాబాద్, నిర్మల్, నిజమాబాద్‌‌‌‌‌‌‌‌ జిల్లాల్లో తక్కువ టెస్టులు చేస్తున్నట్టు రిపోర్ట్‌‌‌‌‌‌‌‌లో పేర్కొంది.