నాలుగు గ్రాముల అల్లం తింటే.. ఇన్సులిన్​ కంట్రోల్

నాలుగు గ్రాముల అల్లం తింటే.. ఇన్సులిన్​ కంట్రోల్

ఉదయం, సాయంత్రం ఒక కప్పు టీ తాగందే.. పొద్దు గడవదు చాలామందికి. కానీ, డయాబెటిక్​ పేషెంట్ల విషయానికొచ్చేసరికి టీకి సంబంధించి బోలెడు ప్రశ్నలు, అనుమానాలు. కొందరు డయాబెటిస్​ ఉన్నా..  హ్యాపీగా టీ తాగొచ్చని  చెప్తారు. మరికొందరేమో వద్దే వద్దంటారు. వీటిల్లో ఏది నిజమో తెలుసుకోవడానికి న్యూట్రిషనిస్ట్ కవితా దేవగన్​ని అడిగితే...టీలలో చాలా వెరైటీలున్నా.. పాలు, చక్కెర లేదా ఆర్టిఫీషియల్​​ స్వీట్​నర్స్​తో చేసిన టీలనే ఇష్టంగా తాగుతుంటారు. కానీ, గేదె, ఆవు పాలల్లో ఐజీఎఫ్( ఇన్సులిన్​– లైక్​ గ్రోత్​ ఫ్యాక్టర్​) అనే హార్మోన్​ ఉంటుంది. ​ఇది రక్తంలో షుగర్​ లెవల్స్​ని పెంచుతుంది. దానికి తోడు టీలో చక్కెర వేస్తారు. టీ రూపంలో ఇంత చక్కెర డయాబెటిక్​ పేషెంట్​ ఒంట్లో చేరితే సమస్యే కదా. అందుకే డయాబెటిక్​ ఉన్నవాళ్లు పాలతో చేసిన టీ తాగకూడదు. దానికి బదులు  బాదం పాలు, పూలు, చెట్ల వేర్లతో తయారుచేసిన టీలు తాగొచ్చు. ముఖ్యంగా డయాబెటిస్​ ఉన్నవాళ్లు​ ఈ ఆరు రకాల టీలని డైట్​లో చేర్చితే షుగర్​ కంట్రోల్​లో​ ఉండటంతో పాటు మరెన్నో లాభాలున్నాయి. అల్లం టీ: రోజుకి నాలుగు గ్రాముల అల్లం తింటే.. శరీరంలో ఇన్సులిన్​ ప్రొడక్షన్​ కంట్రోల్​లో ఉంటుంది. రక్తంలోని షుగర్​ లెవల్స్​ తగ్గుతాయి. గ్లూకోజ్​ లెవల్స్​ కంట్రోల్​లో ఉంటాయి. అందుకే రోజుకు రెండు కప్పుల అల్లం టీ తాగాలి.  అలాగే టీ కాచేటప్పుడు కొంచెం దాల్చిన చెక్క వేసినా.. శరీరంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. 

పసుపు టీ: పరగడుపునే పసుపు టీ తాగితే రక్తంలోని  గ్లూకోజ్ స్థాయిలు తగ్గి, డయాబెటిస్​​ అదుపులో ఉంటుందని చాలా స్టడీలు చెప్పాయి. అంతేకాదు ప్రతిరోజూ పసుపు టీ తాగితే కీళ్ల నొప్పులు, వాపులు తగ్గుతాయి. నెలసరిలో ఇబ్బంది పెట్టే పొత్తి కడుపు, ఒంటి నొప్పుల నుంచి రిలీఫ్​ ఉంటుంది. అలాగే పసుపులోని యాంటీ ఆక్సిడెంట్ గుణాలు గుండె జబ్బుల్ని దరిచేరనివ్వవు. పసుపులో  క్యాన్సర్‌‌‌‌తో పోరాడే గుణాలు కూడా ఉన్నాయి. 

గ్రీన్​ టీ: జర్నల్​ ఆఫ్​ న్యూట్రిషన్​ అండ్​ మెటబాలిజం స్టడీ ప్రకారం గ్రీన్​ టీ టైప్​– 2 డయాబెటిస్​ వల్ల వచ్చే సమస్యల్ని తగ్గిస్తుంది. అదెలాగంటే గ్రీన్ టీ తాగితే బరువు తగ్గొచ్చు. దానివల్ల  కూడా రక్తంలోని​ షుగర్​ లెవల్స్​ బ్యాలెన్స్ అవుతాయి.

చామంతి టీ : మరిగే  నీళ్లలో నాలుగైదు చామంతి పూలు వేసి, కాసేపయ్యాక వడగట్టి తాగినా డయాబెటిస్ కంట్రోల్​లో ఉంటుంది. రోజుకి రెండు కప్పుల చామంతి టీ తాగితే డయాబెటిస్​​ వల్ల వచ్చే ఇతర ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. కంటిచూపు మెరుగుపడుతుంది. కిడ్నీలు హెల్దీగా ఉంటాయి. 
మందారం టీ :  మందారంలో  పాలీఫినోల్స్​, యాంటీ ఆక్సిడెంట్స్ , ఆంథోసైనిన్స్​ఎక్కువగా ఉంటాయి. బ్లడ్​ షుగర్​, లో బీపీని తగ్గిస్తాయి. ఈ టీ తాగితే  ఇన్​ఫ్లమేషన్, , బరువు తగ్గుతుంది. కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది.

బ్లాక్​ టీ : బ్లాక్​ టీతోనూ డయాబెటిస్​ తీవ్రతని తగ్గించొచ్చు. ఈ టీలో  ఉండే థెఫ్లావిన్స్​, థియారూబిగిన్స్​ యాంటీ ఇన్​ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్స్​గా పనిచేస్తాయి. రక్తంలోని గ్లూకోజ్​ లెవల్స్​ని అదుపు చేస్తాయి. రోజుకి 2 నుంచి 3 కప్పుల బ్లాక్​ టీ తాగితే ఇన్సులిన్​ విడుదల​ మెరుగు పడుతుందని స్టడీలు చెప్తున్నాయి. ఫలితంగా షుగర్​ లెవల్స్​ కంట్రోల్​లో ఉంటాయి.