స్కూళ్లు తెరిచి 15 రోజులైనా పాఠ్యపుస్తకాల్లేవ్

స్కూళ్లు తెరిచి  15 రోజులైనా  పాఠ్యపుస్తకాల్లేవ్

మెదక్​ టౌన్​, వెలుగు : స్కూళ్లు తెరిచి పదిహేను రోజులు దాటిపోతున్నా ప్రభుత్వం పాఠ్యపుస్తకాలు ఇవ్వడం లేదని తపస్​ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జిడ్డి ఎల్లం, చల్లా లక్ష్మణ్​ మండిపడ్డారు.  మంగళవారం ఆర్‌‌అండ్‌బీ గెస్ట్‌ హౌస్‌ వద్ద మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం  సీపీఎస్​ ఉద్యోగులకు డీఏ బకాయిలు 17 విడతలుగా చెల్లిస్తామని ఉత్తర్వులు ఇవ్వడం మోసం చేయడమేనన్నారు. పెండింగ్​లో ఉన్న పీఆర్​సీ ఏరియర్స్​ 15 వాయిదాలు ఇప్పటి వరకు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.  

పీఆర్సీ  కమిటీని నియమించాలని, టీచర్ల ఖాళీలను గుర్తించి  డీఎస్సీ నిర్వహించాలని డిమాండ్​ చేశారు.  స్కూళ్లలో స్కావెంజర్స్​ని  నియమించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తపస్ నేతలు తిరునగిరి నర్సింలు, మాధవరెడ్డి, నవీన్ కుమార్, రమేశ్, మధు మోహన్, సిద్దు, ఆంజనేయులు, సాయిలు, యాదగిరి, దేవేందర్ రెడ్డి,  మధు పాల్గొన్నారు.