
ఆషాఢమాసం శుక్ల పక్ష పౌర్ణమిని 'గురు పౌర్ణమి' అనిగానీ, 'వ్యాస పౌర్ణమి' అనిగానీ అంటారు. అన్ని పండుగల కంటే గురుపౌర్ణమికి ఒక ప్రత్యేకత ఉంది. మనకు జ్ఞానాన్ని ప్రసాదించి, జీవితాన్ని ముందుకు నడిపించడంలో సాయపడిన ప్రతి గురువుకు కృతజ్ఞత చెప్పుకోవడమే గురుపౌర్ణమి ముఖ్య ఉద్దేశం. అందుకే ఈ రోజు ఒక్కొక్కరు ఒక్కో విధంగా తమ గురువులను పూజిస్తారు. ఈ వేళ వ్యాసమహర్షి పుట్టిన రోజు కూడా!
రకరకాల గురువులు..
మామూలుగా గురువు అనగానే చదువు చెప్పేవాడని అనుకుంటారు. కానీ, మనకు అనేక రకాల గురువులు ఉన్నారని హిందూ. మత గ్రంథాలు చెప్తున్నాయి. ఏ గురుపుడైనా తన శిష్యుడికి జ్ఞానం ప్రసాదించాలనే లక్ష్యమే ఉంటుంది.
సూచక గురువులు: భక్తి, జ్ఞాన, వైరాగ్య బోధనలు చేసి సాధన సంపత్తి కలిగిన శిష్యులను తయారు చేస్తారు. చరువు చెప్పేవాళ్లు కూడా వీళ్లే
వాటిక గురువులు: ఇశ్రమ ధర్మాలను బోధిస్తూ.. దేహం అశాశ్వతమని గమ్యాన్ని గుర్తు చేస్తారు.
వేదగురువులు: నేర పురాణీ తిహాసాలు చదివి, శిష్యులతో చదివిస్తరు. ధర్మాలను విశదీకరించి ఆచరిస్తూ ఆచరింపజేస్తారు.
నిషిద్ధ గురువులు: మంత్ర తంత్రాలతో... వశీకరణ విద్యలు బోధిస్తారు.
బోధక గురువు: మంత్రాలు ఉపదేశిస్తారు. విహిత గురువులు భోగాల మీద విరక్త కలిగిస్తారు.
కారణ గురువులు: ఆసనాలు ప్రాణాయామాలు చేయించి.. ఖమ్మాతత్త్వాన్ని ఉపదేశించి అద్వైత సీతిని కలిగిస్తారు.
పరమ గురువు: పరమాత్మ అనుభవాన్ని ప్రత్యక్షంగా కలిగిస్తారు.
సద్గురువులు: తెలుసుకోగలిగితే గురువు శిష్యుడు ఒక్కటే అని తెలియజేస్తారు.
-V6 వెలుగు