ప్రతీ భారతీయుడు తప్పక చూడవలసిన సినిమా మేజర్

ప్రతీ భారతీయుడు తప్పక చూడవలసిన సినిమా మేజర్

అడవి శేషు ప్రధాన పాత్రలో నటించిన మేజర్ సినిమాకు అశేష స్పందన వస్తోంది. 2611 ముంబయి ఉగ్రదాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ పాత్రలో శేషు నటన అద్భుతమంటూ ప్రశంసిస్తున్నారు. దేశభక్తి లీడ్ తో తీసిన ఈ సినిమా తెలుగు, మళయాళం, హిందీ భాషల్లో విడుదలై అంతటా పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంటోంది. 

ఈ సినిమాను చూసిన పలవురు సెలబ్రెటీలు ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తాజాగా సూపర్ స్టార్ మహేశ్ బాబు ఈ మూవీపై స్పందించారు. #MajorTheFilmకి అద్భుతమైన స్పందన వచ్చినందుకు ధన్యవాదాలు. నా టీమ్ మొత్తం నిజంగా చాలా గర్వంగా ఉంది! మేము నిజాయితీతోఈ సినిమా చేశాం. దాన్ని దేశ ప్రజలు స్వీకరించారు. ఇది ప్రారంభం మాత్రమే. మేజర్ ఇంకా పెద్ద హిట్ అవుతుంది.. ప్రతి భారతీయుడు తప్పక చూడవలసిన సినిమా ఇది! అని ట్విట్టర్ వేదికగా మహేశ్ తెలిపారు. 

మేజర్ మూవీ అంత బాగా రావడానికి కారణం కథే కాదు.. అందులోని పాత్రలు కూడా. ప్రతీ ఒక్కరూ తమ క్యారెక్టర్స్ లో లీనమై నటిస్తున్నారనే భావన లేకుండా జీవించేశారు. అందుకే ఈ సినిమా అందరి చేతా ప్రశంసలు అందుకుంటోందని సినీ వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో మేజర్ సినిమాలో హీరోకి తండ్రిగా నటించిన ప్రకాశ్ రాజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ పాత్రైనా అలవోకగా చేసి, ప్రేక్షకులను అలరించడంలో దిట్ట. ఆయన కూడా ఈ మూవీలో తన క్యారెక్టర్ గురించి ఓ ఆసక్తికర పోస్ట్ చేశారు. రియల్ మ్యాన్ ఇస్రో ఆఫీసర్ మిస్టర్ ఉన్నికృష్ణన్ మా హీరో మేజర్ తండ్రి ఉన్నికృష్ణన్‌తో కలిసి #మేజర్ ఫిల్మ్‌లో నేను పోషించిన పాత్ర.. నా జీవితంలో మరచిపోలేనిది అంటూ ఆయన ట్వీట్ చేశారు. @ShashiTikka, @AdiviSesh, @urstrulyMahesh అనే ట్యాగ్ లను జత చేస్తూ వారికి ధన్యవాదాలు తెలియజేశారు. 


మరిన్ని వార్తల కోసం...

ట్రెండింగ్ లో #HBDFatherOfCorruption హాష్ ట్యాగ్

పబ్లో అశ్లీల నృత్యాలు.. పలువురు అరెస్ట్