ఏపీలో ప్ర‌తి ఒక్కరికి ఫ్రీగా 3 మాస్కులు

ఏపీలో ప్ర‌తి ఒక్కరికి ఫ్రీగా 3 మాస్కులు

ఏపీలో క‌రోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకి పెరుగుతున్న క్ర‌మంలో.. ఈ మ‌హ‌మ్మారిని అరిక‌ట్టేందుకు రాష్ట్ర ప్ర‌జ‌ల కోసం ఓ మంచి నిర్ణ‌యం తీసుకుంది ప్ర‌భుత్వం. ఇప్ప‌టికే కేంద్రం మాస్కులు త‌ప్ప‌నిస‌రి చేస్తూ ఉత్త‌ర్వులు జారీ చేయ‌గా.. దీనిని దృష్టిలో పెట్టుకుని ఏపీ ప్ర‌జ‌ల‌కు ఫ్రీగా మాస్కులు పంపిణీ చేయాల‌ని నిర్ణ‌యించింది. ఆదివారం జ‌రిగిన క‌రోనా సమావేశంలో అధికారుల‌తో మాట్లాడిన సీఎం జ‌గ‌న్.. ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలిపారు.

రాష్ట్రంలోని ప్ర‌తి ఒక్క‌రికీ ఫ్రీగా 3 మాస్కులు అందించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు జ‌గ‌న్. అందుకు అవ‌స‌ర‌మ‌య్యే మాస్కుల పంపిణీకి సంబంధించిన ఏర్పాట్ల‌ను త్వ‌ర‌గా చూడాల‌ని అధికారుల‌కు సూచించారు సీఎం. క‌రోనా క‌ట్ట‌డికి లాక్ డౌన్ తో పాటు మాస్కులు, వ్య‌క్తిగ‌త శుభ్ర‌త‌, సోష‌ల్ డిస్టెన్స్ ను ప్ర‌తి ఒక్క‌రూ పాటించాల‌న్నారు సీఎం జ‌గ‌న్.