ప్రతీ వ్యక్తి కరోనాపై యుద్ధం చేయాలి

ప్రతీ వ్యక్తి కరోనాపై యుద్ధం చేయాలి

ప్రధాని మోడీ పిలుపుతో ప్రజలు అద్భుతంగా స్పందించారన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. ప్రజలు స్పందిస్తున్న తీరు అద్భుతంగా ఉందన్నారు. కరోనాపై యుద్ధంలో విజయం సాధిస్తామనే విశ్వాసం కల్గిందన్నారు. ఒక్కరోజుతో కరోనా యుద్ధంలో విజయం సాధించలేమన్నారు. కరోనా పూర్తిగా నిర్మూలించేంత వరకు ప్రజలు జనతా కర్ఫ్యూ రోజున ప్రదర్శించిన స్ఫూర్తితో ముందుకెళ్లాలన్నారు. కరోనా ఒక భయంకరమైనటువంటి వ్యాది..ఇది అత్యంత వేగవంతంగా విస్తరిస్తున్న వ్యాధి అని అన్నారు. అందరం కలిసికట్టుగా అడ్డుకోలేకపోతే ఎన్నటికీ పూడ్చలేనటువంటి నష్టం వస్తుందన్నారు.

ప్రపంచ యుద్ధం కంటే తీవ్రమైన పరిస్థితి ఉందన్నారు. అభివృద్ధి చెందిన చైనా, అమెరికా వంటి దేశాల్లో ఈ వైరస్  తీవ్రత ప్రమాదకరంగా ఉందన్నారు. అభివృద్ధి చెందుతున్నటువంటి మన దేశంలో మనం ఇంకా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇప్పటి వరకు భారత్ లో 492 పాజిటివ్ కేసులు నమోదయ్యాయన్నారు. ఇందులో 37 మంది డిశ్చార్జ్ అయ్యారన్నారు. ఇప్పటి వరకు విమానాశ్రయాల్లో 15,24,266 మంది ప్రయాణికులకు స్క్రీనింగ్ నిర్వహించామన్నారు. ల్యాండ్ బోర్డర్ వద్ద 19లక్షల మందికి పైగా స్క్రీనింగ్ చేశామన్నారు.