
- ఇతర దేశాలలో ఉద్యోగమిచ్చిన కంపెనీలే ఖర్చు పెడుతున్నయ్
వెలుగు బిజినెస్ డెస్క్: కెరీర్లో ఎదిగేలా స్కిల్స్ పెంచుకోవడానికి మన వాళ్లు ఏటా రూ. 2 లక్షల కోట్లు సొంత జేబులోంచి ఖర్చు పెడుతున్నారని ఒక స్టడీలో తేలింది. ప్రొఫెషనల్ఎడ్యుకేషన్ ప్లాట్‌ఫామ్ ఎమెరిటస్ తాజాగా తన గ్లోబల్ వర్క్‌ప్లేస్ స్కిల్స్ స్టడీ 2023 స్టడీ రిపోర్టును రిలీజ్ చేసింది. దేశంలో వివిధ రంగాలలో పనిచేసే ప్రతి ఇద్దరు వ్యక్తులలో ఒకరు తమ ఎడ్యుకేషన్ మెరుగుపరుచుకునేందుకు, తమతోపాటు పిల్లలు, కుటుంబ సభ్యుల ఎడ్యుకేషన్ మెరుగుకోసం రాబోయే ఏడాది కాలంలో రెడీగా ఉన్నట్లు ఈ స్టడీలో తేలింది.
ఎడ్యుకేషన్‌కు హై ప్రయారిటీ....
ఎడ్యుకేషన్ ఇండియన్స్ ప్రయారిటీలలో (ప్రాధాన్యం) మొదటి వరసలో నిలుస్తోందని స్టడీ వెల్లడించింది. హెల్త్‌కేర్, మెడిసిన్స్, గ్రోసరీస్ వంటి వాటిపై ఖర్చు విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు ఈ సర్వేలో పాల్గొన్న ప్రతి ముగ్గురిలోనూ ఇద్దరు తెలిపారు. గ్లోబల్‌గా జాబ్స్ పోతుండటంతోపాటు, జీతాలు తగ్గుతున్న నేపథ్యంలో ఈ జాగ్రత్త వహిస్తున్నట్లు వారు పేర్కొంటున్నారు.
అప్ స్కిల్లింగ్ కోసం సొంత డబ్బును వెచ్చించే విషయంలో మన వాళ్లే ముందున్నట్లు కూడా ఈ స్టడీ చెబుతోంది. చాలా ఇతర దేశాలలో ఈ ఖర్చును ఆయా సంస్థలే భరిస్తున్నాయని తెలిపింది.ఈ సర్వేలో ఇండియాతోపాటు, అమెరికా, ఫ్రాన్స్, చైనా వంటి 18 దేశాలకు చెందిన 6,600 మంది ప్రొఫెషనల్స్ భాగం పంచుకున్నట్లు ఎమెరిటస్ వెల్లడించింది. అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నప్పుడు ఆయా రంగాలలో పనిచేసే ప్రొఫెషనల్స్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ఎంత వరకూ ఇష్టపడతారో తెలుసుకోవడంపై ఈ ఎమెరిటస్ స్టడీ ఫోకస్ పెట్టింది.
21–65 ఏళ్ల మధ్య వయసున్న 1,720 మంది ఇండియన్స్ స్టడీలో పాల్గొన్నారని, వారిలో టైర్1, టైర్2 సిటీలకు చెందిన వారున్నారని ఎమెరిటస్ వెల్లడించింది. సాఫ్ట్వేర్, ఐటీ సర్వీసెస్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్, ఎడ్యుకేషన్, మాన్యుపాక్చరింగ్, టెక్నాలజీ అండ్ ఇన్నొవేషన్, హెల్త్‌కేర్, ఇంజినీరింగ్ అండ్ కన్స్ట్రక్షన్, రిటైల్‌సహా వివిధ రంగాలలోని ప్రొఫెషనల్స్ పై ఈ సర్వే నిర్వహించినట్లు ఎమెరిటస్ తెలిపింది.
స్కిల్స్ పెంచుకోవడం ఎందుకు..
జాబ్ సెక్యూరిటీ కోసం, సెల్ఫ్‌కాన్ఫిడెన్స్ ఎక్కువయ్యేందుకు, లీడర్షిప్ స్కిల్స్ మెరుగుపరుచుకోవడానికి , వారు పనిచేసే ఇండస్ట్రీలో కొత్త పోకడలను అప్డేట్ చేసుకోవడానికి తమ స్కిల్స్ పెంచుకోవడం అవసరమని ఇండియన్స్ నమ్ముతున్నట్లు స్టడీ వెల్లడించింది. తమ స్కిల్స్ పెంపొందించుకోవడానికి ఎక్కువ గంటలనే మన వాళ్లు కేటాయిస్తున్నారు. లెర్నింగ్కొనసాగించడంపై మన సొసైటీలో ఉండే మక్కువ దీనిని బట్టే అర్ధమవుతోందని ఎమిరెటస్ స్టడీ రిపోర్టు చెబుతోంది.
వారానికి 11 గంటల సమయాన్ని స్కిల్స్ పెంచుకోవడంపై పెట్టడానికి ఇండియన్స్ ఇష్టపడుతున్నట్లు వివరిస్తోంది. అయితే, అప్‌స్కిల్లింగ్ కోసం షార్ట్–డ్యూరేషన్ కోర్సుల వైపే వారు మొగ్గుచూపుతున్నారు. ఏదైనా అప్‌స్కిల్లింగ్ ప్రోగ్రామ్ కోసం అయిదు నెలల సమయాన్ని వెచ్చించడానికి మన దేశంలోని ప్రొఫెషనల్స్ సానుకూలంగా ఉన్నట్లు ఈ స్టడీ రిపోర్టు వెల్లడిస్తోంది.
పర్సనలైజ్డ్ కెరీర్ ప్లాన్స్, గ్యారంటీడ్ ఇంటర్న్షిప్స్, నెట్వర్కింగ్ ఆపర్చునిటీస్, కెరీర్ వర్క్‌షాప్ బెనిఫిట్స్ వంటివి ఉండే ప్రోగ్రామ్స్ కోసం కొంత ఎక్కువ ఖర్చును పెట్టేందుకు సైతం ఇండియన్స్ ఇష్టపడుతున్నారు. పై బెనిఫిట్స్‌లో ఒక దానికోసమైనా తాము ఖర్చు ఎక్కువ పెట్టేందుకు రెడీగా ఉన్నట్లు సర్వేలో పాల్గొన్న ప్రతి 10 మందిలో ఏడుగురు వెల్లడించినట్లు స్టడీ పేర్కొంది. మంత్లీ ఇన్స్టాల్మెంట్స్లో చెల్లింపు, క్యాష్‌బ్యాక్ బెనిఫిట్స్, టోటల్ రీఫండ్ గ్యారంటీ వంటి ఆఫర్లు కూడా ఇండియన్స్‌ను ఆకట్టుకునే అంశాలుగా తేల్చింది.
జాబ్ మార్కెట్లో తమ అవకాశాలు పెంచుకోవాలంటే స్కిల్స్‌పై ఫోకస్ తప్పనిసరని గుర్తించడంతోపాటు, ఆ దిశలో ప్రయత్నాలు కూడా ఇండియన్స్ చేస్తున్నారు. ఎడ్యుకేషన్, అప్‌స్కిల్లింగ్‌పై ఖర్చు పెట్టడాన్ని తెలివైన పెట్టుబడిగా వారు భావిస్తున్నారు. తమ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడానికి నాలెడ్జ్ ముఖ్యమైనదని అర్ధం చేసుకుంటున్నారు.
-
ఎమెరిటస్ ఇండియా సీఈఓ మోహన్ కన్నెగల్