ప్రోగ్రాంకు అందరూ హాజరు కావాల్సిందే

ప్రోగ్రాంకు అందరూ హాజరు కావాల్సిందే

బయట మాట్లాడకుండా.. లోపల కూర్చొని మాట్లాడుకోవాలని సీనియర్, జూనియర్ నేతలకు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క సూచించారు. ఒక ప్రోగ్రాంకు పిలుపునిస్తే.. అందరూ హాజరు కావాల్సిందేనని.. ఇదోదే పేరంటం.. భోజనం కాదన్నారు. గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ నేతలు బాహాటంగానే విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. పార్టీకి రాజీనామా చేసి అధిష్టానంపై విమర్శలు గుప్పిస్తున్నారు. త్వరలో మునుగోడు ఉప ఎన్నిక వస్తున్న నేపథ్యంలో ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటుంటడం కాంగ్రెస్ నేతల్ల ో కలవరం స్టార్ట్ అయ్యింది. 

కలిసి పనిచేయాలి...
మునుగోడులో శనివారం కాంగ్రెస్ పలు కార్యక్రమాలను నిర్వహించనుంది. అందులో భాగంగా ఎమ్మెల్యే సీతక్కతో v6 మాట్లాడింది. కాంగ్రెస్ లో సంక్షోభం ఉన్నప్పుడు కలిసి పని చేయాలని... అధిష్టానం వద్ద మాట్లాడుకోవచ్చన్నారు. మోసం చేసి ఓ వ్యక్తి బయటకు పోయినప్పుడు.. ఇలాంటి టైంలో కొంతమంది నేతలు ఏదో ఏదో మాట్లాడుతున్నారని విమర్శించారు. ఈ విషయాలన్నీ క్యాడర్ తో పాటు ప్రజలు అర్థం చేసుకుంటున్నారని తెలిపారు. గతంలో పార్టీలో ఎన్నో సమస్యలు వచ్చినా.. పరిష్కరించుకుందన్నారు. మునుగోడులో కాంగ్రెస్ నిర్వహించే కార్యక్రమాలకు అందరూ వస్తారనే ఆశాభావం వ్యక్తం చేశారు. మునుగోడు నియోజకవర్గం కాంగ్రెస్ కు కంచుకోట అన్నారు. గతంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో అనేక ఉద్యమాలు జరిగాయనే విషయాన్ని గుర్తు చేశారు. 

రాజీవ్ జయంతి కార్యక్రమాలు..
ఏడు మండలాలు, 175 గ్రామాల్లో రాజీవ్ జయంతి కార్యక్రమాలకు హస్తం పార్టీ నేతలు ప్లాన్ చేశారు. ప్రతి గ్రామంలో కాంగ్రెస్ ర్యాలీలతో పాటు.. నడిబొడ్డున పార్టీ జెండా ఆవిష్కరించాలని నిర్ణయించారు. ప్రతి ఇంటికి పండ్ల బుట్ట పంపిణీ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా విస్తృత కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. ప్రతి ఇంటికి మన మునుగోడు - మన కాంగ్రెస్ పేరుతో స్టిక్కర్లు, కరపత్రాలు అందజేయనున్నారు.