
వెలుగు, హైదరాబాద్‌సిటీ : మిస్‌వరల్డ్ పోటీలకు గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో సర్వం సిద్ధమైంది. 100కు పైగా దేశాల నుంచి తరలివచ్చిన కంటెస్టెంట్లు శుక్రవారం రిహార్సల్స్ చేశారు. హావభావాలతో స్టేజ్‌పై హొయలు పోయారు. శుక్రవారం సిటీకి చేరుకున్న మిస్‌వరల్డ్2024 క్రిస్టినా పిస్కోవాకు అధికారులు ఘన స్వాగతం పలికారు. ఓపెనింగ్సెర్మనీలో తెలంగాణ సంప్రదాయాన్ని ప్రపంచానికి చాటేలా ప్రత్యేక ప్రదర్శనలు, విన్యాసాలు ప్లాన్చేశారు.