ఎస్సై ఎగ్జామ్ కు నిమిషం ఆలస్యమైన నో ఎంట్రీ

ఎస్సై ఎగ్జామ్ కు నిమిషం ఆలస్యమైన నో ఎంట్రీ

ఎస్సై ఉద్యోగాలకు ఆదివారం రాత పరీక్ష జరగనుంది. ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు ప్రిలిమినరీ ఎగ్జామ్ జరగనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. హైదరాబాద్ లో 503 సెంటర్స్, జిల్లాల్లో 35 సెంటర్స్ ఏర్పాటు చేయగా..2 లక్షల 47 వేల 217మంది అభ్యర్ధులు ఎగ్జామ్ రాయనున్నారు. నిమిషం అలస్యమైన ఎగ్జామ్ హాల్ కి అనమతించమని అధికారులు స్పష్టం చేశారు. 

అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టామని అధికారులు తెలిపారు. విద్యార్థులు 9గంటల కల్లా ఎగ్జామ్ హాల్ కు చేరుకోవాలని అధికారులు సూచించారు. OMR షీట్స్ పై ఎలాంటి రాతలు రాసిన ఆన్సర్ షీట్ గా పరిగణించమని..బ్లూ, బ్లాక్ బాల్ పాయింట్ పెన్స్ మాత్రమే తెచ్చుకోవాలని సూచించారు. ఎగ్జామ్ కి వచ్చే అభ్యర్థులకు బయోమెట్రిక్ అటెండెన్స్ ఉంటుంది కాబట్టి మెహందీ, టెంపరరీ ట్యూటూలు ఉండకుండా చూసుకోవాలన్నారు.

ఎస్సై ప్రిలిమినరీ ఎగ్జామ్ లో 200 మార్కులకు గానూ..60 మార్కులు వస్తే క్వాలిఫై చేస్తారు. ఈ ఎగ్జామ్ లో నెగిటివ్ మార్కులు ఉన్నాయి..ఒక్క రాంగ్ ఆన్సర్ కి 0.2 నెగటివ్ మార్క్స్ ఉంటాయి.. అంటే ఐదు తప్పుడు ఆన్సర్ చేస్తే ఒక మార్కును కట్ చేస్తారు.తెలుగు మీడియం ఎంచుకున్న వారికి ఇంగ్లీష్ - తెలుగు, ఉర్దూ మీడియం సెలక్ట్ చేసుకున్న వారికి ఇంగ్లీష్ - ఉర్దూ లాంగ్వేజస్ లో క్వశ్చన్ పేపర్ ఉండనుంది.