ఎస్బీఐ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు ఫోన్ టాపింగ్ కేసులో దర్యాప్తు కంటిన్యూ అవుతోంది. బంజారాహిల్స్ పీఎస్ లో ప్రణీత్ రావును ప్రశ్నిస్తున్నారు పోలీసులు. నాల్గవ రోజు కస్టడీలో భాగంగా ప్రణీత్ రావును విచారిస్తున్నారు. వెస్ట్ జోన్ డీసీపీ, బంజారాహిల్స్ ఏసీపీ నేతృత్వంలో దర్యాప్తు కొనసాగుతోంది. ప్రణీత్ రావుకు సహకరించిన మరో ఇద్దరు ఇన్స్ స్పెక్టర్లను అదుపులోకి తీసుకోని విచారిస్తున్నారు.
ఇక ప్రణీత్ స్టేట్మెంట్ ఆధారంగా మరికొంత మందికి నోటీసుల్చి విచారించనున్నారు పోలీసులు. నాంపల్లి కోర్టు ఇచ్చిన కస్టడీని సవాల్ చేస్తూ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు ప్రణీత్ రావు. విచారణ తర్వాత రాత్రి టైంలో జైల్ కి తరలించాలని పిటిషన్ లో పేర్కొన్నారు ప్రణీత్ రావు. కుటుంబ సభ్యులు, అడ్వకేట్లను కలిసేందుకు పర్మిషన్ ఇప్పించాలని పిటిషన్ వేశారు.
రహస్యం పేరుతో బంజారాహిల్స్ పీఎస్ లో విచారిస్తున్నారన్నారు ప్రణీత్ రావు న్యాయవాది. ఇప్పటికే కేసుకు సంబంధించిన పూర్తి డిటైల్స్ అందించినందున కస్టడీ రద్దు చేయాలని కోరారు. దీంతో పిటిషన్ పై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది.
