మాజీ మంత్రి తుమ్మల ఇంట్రెస్టింగ్ కామెంట్స్

మాజీ మంత్రి తుమ్మల ఇంట్రెస్టింగ్ కామెంట్స్

మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏ క్షణమైనా పిడుగు పడొచ్చని బాంబు పేల్చారు. గత ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం తిరిగి ప్రచారం చేశానన్న తుమ్మల గతంలో జరిగిన పొరపాట్లు మళ్లీ జరగకుండా చూసుకోవాలన్నారు. మంత్రిగా ఉన్నప్పుడు ఎక్కువ సమయం అభివృద్ధికే కేటాయించినట్లు చెప్పారు. ప్రస్తుతం పాలేరులోనే కార్యకర్తలకు అందుబాటులో ఉంటానని..వారికే పూర్తి సమయం కేటాయిస్తానని స్పష్టం చేశారు. 

కాగా గత ఎన్నికల్లో ఓటమి తర్వాత తుమ్మల తన నియెజకవర్గానికే పరిమితమయ్యారు. టీఆర్ఎస్ తగిన ప్రాధాన్యత ఇస్తలేదని.. పార్టీ మారుతారనే ప్రచారం పలుసార్లు వినిపించింది. అయితే ఆయన మాత్రం వాటిపై స్పందించలేదు. ఇటీవలే కేటీఆర్ కూడా ఖమ్మం పర్యటనలో తుమ్మల అనుభవాన్ని ఉపయోగించుకోవాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ఈ నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.