నిరుద్యోగుల జీవితాలతో ప్రభుత్వాలు చెలగాటమాడుతున్నాయి

నిరుద్యోగుల జీవితాలతో  ప్రభుత్వాలు చెలగాటమాడుతున్నాయి

కేంద్రం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ ను వెంటనే రద్దు చేయాలని ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య డిమాండ్ చేశారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ అల్లర్లలో మరణించిన రాకేష్ కుటుంబానికి 50 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వడంతోపాటు ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో వ్యవసాయ చట్టాలతో రైతులను ఇబ్బందులకు గురిచేసిన కేంద్రం..ఇప్పుడు అగ్నిపథ్ తీసుకువచ్చి నిరుద్యోగులతో చెలగాటం ఆడుతోందని మండిపడ్డారు. అగ్నిపథ్ లో చేరే వారి పరిస్థితి నాలుగేళ్ల తర్వాత ఏంటని ఆయన ప్రశ్నించారు.  ఇక విద్యార్థులపై పెట్టిన కేసులు వెంటనే ఎత్తివేయాలని నర్సయ్య డిమాండ్ చేశారు.