వీడు చేసిన నేరానికి: కాళ్లతో తన్ని.. గుంజీలు తీయించి.. ముఖంపై ఊశారు

వీడు చేసిన నేరానికి: కాళ్లతో తన్ని.. గుంజీలు తీయించి.. ముఖంపై ఊశారు

సమాజంలో ఆడవారిపై జరుగుతున్న అరాచకాలు అంతా ఇంతా కాదు. ఒంటరిగా బయట కనపడితే చాలు కంటి చూపుతోనే కాల్చుకు తినే కామాంధులు కొందరైతే.. హత్యలు, హత్యాచారాలకు తెగబడే నీచులు మరికొందరు. ఇలాంటి నీచులకు భయపడి తల్లి తన బిడ్డకు బహిరంగంగా గుక్కెడు పాలు ఇవ్వలేని పరిస్థితి. పోనీ ఇంట్లో ఉంటే సురక్షితమా? అంటే అదీ లేదు. ఇళ్లలోకి చొరబడుతున్నారు. 

అలాంటి ఓ నీచుడికి గ్రామస్థులతో కలిసి ఓ మాజీ ప్రజా ప్రతినిధి సరైన శిక్ష విధించారు. మహిళలు స్నానం చేస్తుంటే వీడియోలు చిత్త్రీకరించడం.. వాటిని చూస్తూ ఎంజాయ్ చేయటం ఓ కామాంధుడి దినచర్య. ఇలానే చేస్తూ ఓసారి గ్రామస్తులకు పట్టుబడ్డాడు. ఇంకేముంది నాలుగు వాయించటమే కాకుండా.. నలుగురు ముందు పంచాయితీలో నిలబెట్టారు.

అక్కడ ఓ మాజీ ప్రజా ప్రతినిధి అతని చేత గుంజీలు తీయించి ఉమ్మి నాకించారు. వీటిని కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారాయి.  ఈ ఘటన జార్ఖండ్‌‌లోని దుమ్కాలో చోటు చేసుకుంది.

అయితే ఆ మాజీ ప్రజా ప్రతినిధి చర్యలను కొందరు తప్పుబడుతున్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం సరైనదని కాదని సూచిస్తున్నారు. వీడియోలో ఆ ప్రజా ప్రతినిధి.. అతనిని కాలుతో తన్నడం కూడా మనం చూడవచ్చు.