హైదరాబాద్, వెలుగు: బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్సీ బి.మోహన్‌రెడ్డి బీఆర్ఎస్లో చేరారు. గురువారం బేగంపేట క్యాంపు ఆఫీస్‌లో మంత్రి కేటీఆర్ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాష్ట్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్పార్టీయేనని, విద్యారంగం, టీచర్లకు సంబంధించిన అంశాలపై పని చేసేందుకే పార్టీలో చేరుతున్నట్లు మోహన్‌రెడ్డి తెలిపారు.
