ఖర్గేతో వివేక్ వెంకటస్వామి కుటుంబం భేటీ : కేసీఆర్ ను ఓడించేందుకు పని చేస్తాం

ఖర్గేతో వివేక్ వెంకటస్వామి కుటుంబం భేటీ : కేసీఆర్ ను ఓడించేందుకు పని చేస్తాం

తెలంగాణ ప్రజల ఆంక్షాలకు అనుగుణంగా.. కేసీఆర్ కుటుంబ పాలన, రాక్షస పాలన అంతం చేసేందుకు పని చేస్తామన్నారు పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి. నవంబర్ 2వ తేదీ ఢిల్లీలో.. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు ఖర్గేతో.. ఆయన నివాసంలో భేటీ అయ్యారు. వివేక్ వెంకటస్వామితోపాటు ఆయన సతీమణి సరోజ, కుమారుడు వంశీ కృష్ణ కూడా ఖర్గేతో భేటీ అయిన వారిలో ఉన్నారు. గాంధీ కుటుంబంతో మూడు తరాల అనుబంధం ఉందని.. రాహుల్ గాందీ లీడర్ షిఫ్ లో పని చేయటం సంతోషంగా ఉందన్నారు వివేక్ వెంకటస్వామి.

పార్టీలోకి వచ్చిన సందర్భంగా ఖర్గేతో ఆశీర్వాదం తీసుకోవటం జరిగిందన్న ఆయన.. తన తండ్రి వెంకటస్వామితో ఖర్గేకు మంచి అనుబంధం, మిత్రుత్వం ఉందని స్పష్టం చేశారాయన. తెలంగాణ ఉద్యమంలో పని చేసిన వారంతా పార్టీలోకి రావటం సంతోషంగా ఉందని ఖర్గే వ్యాఖ్యానించినట్లు వివరించారు వివేక్ వెంకటస్వామి. 

 తెలంగాణలో కేసీఆర్ ఓటమి లక్ష్యంగా పని చేస్తామని.. కాళేశ్వరం బ్యాక్ వాటర్ తో రైతులు ఇబ్బంది పడుతున్నట్లు వెల్లడించారాయన. బీజేపీ పార్టీ నుంచి బయటకు రావటానికి కారణాలు వివరిస్తూ.. మొన్నటి వరకు పార్టీ ఎలా ఉందో.. ఇప్పుడు ఎలా ఉందో స్పష్టంగా కనిపిస్తుందని.. బీజేపీలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అందరికీ తెలిసిందేనని వ్యాఖ్యానించారాయన. రాహుల్ గాంధీ స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానించారని.. ఆ మేరకు కాంగ్రెస్ పార్టీలో చేరటం జరిగిందన్నారాయన. రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలకు కేసీఆర్ రాక్షస పాలన నుంచి విముక్తి లభిస్తుందని వివరించారాయన. 

 

ALSO READ :- మంత్రి సబితా వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు.. ఆమె పర్సును కూడా వదల్లేదు