ఇయ్యాల కాళేశ్వరంపై అధికారుల అఫిడవిట్ల పరిశీలన!

ఇయ్యాల కాళేశ్వరంపై అధికారుల అఫిడవిట్ల పరిశీలన!
  •     మూడో విడత విచారణ కోసం హైదరాబాద్​కు వచ్చిన జస్టిస్​ ఘోష్​

హైదరాబాద్, వెలుగు : కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై విచారణలో భాగంగా జ్యుడీషియల్​​ కమిషన్​ చైర్మన్​ జస్టిస్​ పినాకి చంద్ర ఘోష్.. అధికారులు సమర్పించిన​ అఫిడవిట్లను పరిశీలించనున్నారు. మూడో విడత విచారణ కోసం ఆయన​ శుక్రవారం హైదరాబాద్​కు వచ్చారు. సాయంత్రం తాజ్​కృష్ణ హోటల్​లో అధికారులతో జస్టిస్​ ఘోష్​ భేటీ అయ్యారు. అలాగే, ఎక్స్​పర్ట్​ కమిటీ సభ్యులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

బ్యారేజీల పరిస్థితిపై ఆరా తీశారు. టెక్నికల్​అంశాలపై వివరాలు తెలుసుకున్నట్టు సమాచారం. శనివారం ఉదయం ఎక్స్​పర్ట్​ కమిటీ సభ్యులతో మరోసారి సమావేశమయ్యే అవకాశాలున్నాయని తెలుస్తున్నది. వాటితోపాటు శనివారం నుంచే అఫిడవిట్లను క్షుణ్నంగా పరిశీలించేందుకు ఆస్కారం ఉన్నట్టు తెలిసింది.

ఆదివారం నుంచి అఫిడవిట్లు సమర్పించిన అధికారులతో క్రాస్​ ఎగ్జామినేషన్​ను మొదలు పెట్టే చాన్స్​ ఉందని సమాచారం. మూడో విడత విచారణపై శనివారం జస్టిస్​ ఘోష్​ షెడ్యూల్​ను ఖరారు చేసే అవకాశం ఉందని అధికార వర్గాలు చెప్తున్నాయి.