టెన్త్ స్టూడెంట్స్‌లో ఎగ్జామ్స్ టెన్షన్

టెన్త్ స్టూడెంట్స్‌లో ఎగ్జామ్స్ టెన్షన్
  • క్లాసులు మళ్లీ ఆన్ లైన్‌కి షిఫ్ట్ అవడంతో ఆగమాగం
  • టఫ్ సబ్జెక్టులు అర్థం కాక ఇబ్బందులు
  • సిలబస్ తగ్గించినా నో యూజ్ అంటున్న టీచర్లు

హైదరాబాద్, వెలుగు: స్కూల్స్ క్లోజ్ చేయడంతో టెన్త్ స్టూడెంట్స్ పరిస్థితి ఆగమాగంగా మారింది. ఫిబ్రవరి 1 నుంచి స్కూల్స్ రీ ఓపెన్ అవడంతో టీచర్లతో ఇంటరాక్ట్ అవుతూ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చని స్టూడెంట్స్ సంబరపడ్డారు. ఇప్పుడు మళ్లీ సీన్ రివర్స్ అయింది. ఓ వైపు బోర్డ్ ఎగ్జామ్స్ దగ్గర పడుతుండడం, బడులు క్లోజ్ అవడంతో స్టూడెంట్స్ ఒత్తిడికి గురవుతున్నారు.  ప్రైవేటులో చదివే స్టూడెంట్స్కు పేరెంట్స్ ట్యూటర్స్ ని పెట్టి సబ్జెక్టులు రివిజన్ చేయిస్తున్నారు. సర్కారు స్కూళ్ల స్టూడెంట్స్కు అలాంటి సౌకర్యం లేక మానసికంగా కుంగిపోతున్నారు. గవర్నమెంట్ 30 శాతం సిలబస్ ని తగ్గించినా దానివల్ల పిల్లలకు ఏవిధంగా యూజ్ ఫుల్ కాదని హెడ్ మాస్టర్లు, క్లాస్ టీచర్లు చెబుతున్నారు. 
 ప్రిపరేషన్ టెన్షన్..
స్కూల్లో అయితే టీచర్ల గైడెన్స్తో ప్రిపేర్ అవడానికి, ఇంట్లో ఒంటరిగా చదవడానికి చాలా తేడా ఉందని స్టూడెంట్స్ అంటున్నారు. టెన్త్ క్లాస్ చదువంతా డిజిటల్ క్లాసులతో అయిపోయింది. ప్రభుత్వ, ప్రైవేటు స్కూల్స్ లోని స్టూడెంట్స్ ఆన్లైన్ క్లాసుల కారణంగా లెస్సెన్స్ అర్థంకాక, సబ్జెక్ట్ నాలెజ్డ్ ఇంప్రూవ్ అవ్వక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సర్కారు బడుల్లోని స్టూడెంట్స్కు స్మార్ట్ ఫోన్లు లేక,  ఉన్నా నెట్ వర్క్ ప్రాబ్లమ్స్కారణంగా పాఠాలు వినలేకపోయారు. డిజిటల్ క్లాసులకు రెగ్యులర్గా అటెండ్ అయినా సబ్జెక్ట్ ల్లో అనేక డౌట్సు వచ్చేవి.  స్కూల్స్ ఎప్పుడెప్పుడు ఓపెన్ అవుతాయా స్టూడెంట్స్ ఎదురు చూశారు. రీ ఓపెన్ అయ్యాక టీచర్లు మళ్లీ మొదటి నుంచి లెస్సెన్స్ చెప్పారు. కేవలం ఇంపార్టెంట్ చాప్టర్లనే చెప్తూ, వాటిపైనే డైలీ టెస్టులు కండక్ట్  చేశారు.  స్టూడెంట్స్ ఒత్తిడికి లోనవకుండా వారిని మోటివేట్ చేస్తూ ఫైనల్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ చేశారు. ఇప్పుడు మళ్లీ మొత్తం గాడీ తప్పడంతో మునుపటితో పోలిస్తే ఎగ్జామ్స్ ప్రిపరేషన్ టెన్షన్ రెండింతలైందని స్టూడెంట్స్ పేర్కొంటున్నారు. 
టెన్త్ క్లాస్ బేస్ కావడంతో..
సిటీవ్యాప్తంగా 181 గవర్నమెంట్ హై స్కూల్స్ ఉండగా,  10 క్లాస్ లో 9, 573 మంది, ప్రైవేటు హై స్కూల్స్ 1,184 ఉండగా, టెన్త్క్లాస్లో 58,609 స్టూడెంట్స్ చదువుతున్నారు. మే 17 నుంచి టెన్త్ క్లాస్ బోర్డ్ పరీక్షలు కావడంతో స్టూడెంట్స్ ఎగ్జామ్స్కి సంబంధించి టెన్షన్  పడుతున్నారు. మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లీష్ సబ్జెక్టుల్లో వెనుకబడ్డ స్టూడెంట్స్ వాటిని ఎలా అర్థం చేసుకోవాలో తెలియడం లేదంటున్నారు. టీచర్లు కూడా ఫోన్ల ద్వారా పిల్లల డౌట్స్ను క్లారిఫై చేస్తున్నామంటున్నారు. వాట్సాప్ గ్రూప్ల ద్వారా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ని పంపిస్తూ రివిజన్ చేయమని చెబుతున్నారు. ఇంటర్నల్ మార్క్స్ కోసం ప్రాజెక్టులు పూర్తి చేసి స్కూళ్లకు తీసుకొచ్చి సబ్మిట్ చేయాలంటున్నారు. ఉన్నత చదువులకు  పదో తరగతి బేస్ కావడం, డిజిటల్ క్లాసుల వల్ల సబ్జెక్ట్స్ మీద సరైన పట్టు లేకపోవడంతో స్టూడెంట్స్ భయపడుతున్నారు. మరో వైపు పేరెంట్స్ కూడా ఈసారి యాన్యువల్ ఎగ్జామ్స్ ఎలా ఉంటాయా అనే విషయంలో మానసికంగా సతమతవుతున్నారు. 

డౌట్స్ వస్తున్నయ్..
స్కూల్ ఉంటేనే బాగుండేది. డైరెక్ట్ క్లాసు లు వింటేనే లెస్సెన్స్ అర్థమవుతాయి.  ఆన్లైన్ క్లాసులతో చాలా ఇబ్బంది పడుతున్నా.  మ్యాథ్స్ లో చాలా డౌట్స్ వస్తున్నాయి. ఏం అర్థం కావడంలేదు.
 ఎగ్జామ్స్ డేట్ దగ్గర పడుతోంది. ప్రతి చిన్న డౌట్కి టీచర్ కు కాల్ చేసి అడగలేకపోతున్నా. - మహేశ్వరి, టెన్త్ స్టూడెంట్, ప్రభుత్వ హైస్కూల్, ఫిలింనగర్

ఏం చేయలేని పరిస్థితి
టెన్త్ స్టూడెంట్స్ చాలా ఇబ్బంది పడుతు న్నారు. స్కూల్స్రీ ఓపెన్ అయినంక బాగా ప్రిపేర్ అవ్వాలని అనుకున్నారు. మేం కూడా ఇంపార్టెంట్ చాప్టర్ రివిజన్ చేయించాం. డైలీ టెస్టులు కండక్ట్ చేశాం. ఇప్పుడు అవేమి ఉండవు. వాళ్లే ప్రిపేర్ అవ్వాలి.  ఫోన్లో  టచ్లో ఉంటున్నాం. కానీ వాళ్లు మెంటల్గా స్ట్రాంగ్ లేరనిపిస్తోంది. స్టూడెంట్స్  కంగారు పడుతున్నా ఏం చేయలేని పరిస్థితి. -రేణు, హెచ్ఎం, గవర్నమెంట్ స్కూల్