గృహోపకరణాల ప్రధాన సంస్థ కెన్‌స్టార్ తన కొత్త 5-స్టార్ బిఈఈ రేటింగ్ గల వాటర్ హీటర్ల శ్రేణిని ఆవిష్కరించింది. ఇవి 20 శాతం ఎక్కువ వేడి నీరు, 40 శాతం ఎక్కువ లైఫ్, 10 శాతం మెరుగైన హీట్ రిటెన్షన్‌ను అందిస్తాయి. వీటిని స్విర్ల్ హీట్ టెక్నాలజీ, జర్మన్ బ్లూ సఫైర్ కోటింగ్, హై-డెన్సిటీ పీయూఎఫ్ ఇన్సులేషన్‌తో రూపొందించారు.
ఇవి ఆధునిక భారతీయ ఇండ్ల అవసరాలకు సరిపోయే విధంగా రూపకల్పన చేశారు. 8-బార్ ప్రెజర్ కంపాటిబిలిటీ, 7-లెవల్ సేఫ్టీ షీల్డ్, ఏడేళ్ల ట్యాంక్ వారంటీతో వస్తున్నాయి.
