Kishkindhapuri: గర్జిస్తున్న హారర్ థ్రిల్లర్ ‘కిష్కింధపురి’.. రెండో రోజు రెట్టింపు మౌత్ టాక్తో.. మారిన బాక్సాఫీస్ కలెక్షన్లు

Kishkindhapuri: గర్జిస్తున్న హారర్ థ్రిల్లర్ ‘కిష్కింధపురి’.. రెండో రోజు రెట్టింపు మౌత్ టాక్తో.. మారిన బాక్సాఫీస్ కలెక్షన్లు

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన హారర్ థ్రిల్లర్ ‘కిష్కింధపురి’ కలెక్షన్ల వేగం పెంచింది. సెప్టెంబర్ 12న థియేటర్లలో విడుదలైన ఈ మూవీకి, రెండో రోజైన శనివారం మరింత బజ్తో దూసుకెళ్తోంది. ఈ క్రమంలోనే మొదటి రోజు వసూళ్ల కంటే, రెండో రోజు రెట్టింపు కలెక్షన్లు సాధించి సత్తా చాటుకుంది.

తొలిరోజు ఇండియాలో రూ.2 కోట్ల నెట్ సాధించిన ఈ మూవీ, రెండో రోజు దాదాపు రూ.2.66 కోట్లకి పైగా నెట్ వసూళ్లు చేసింది. అయితే, శనివారం ఫస్ట్ షో + నైట్ షోలకు విపరీతమైన బుకింగ్స్ జరిగాయి. ఈ క్రమంలోనే ఇండియాలో మొత్తం రెండు రోజుల నెట్ కలుపుకుని రూ.4.81 కోట్లు వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

అయితే, ఈ హారర్ థ్రిల్లర్ కిష్కింధపురి సినిమాకు ఫస్ట్ డే మిక్సెడ్ టాక్ వచ్చింది. ఆడియన్స్ అంత మిరాయ్తో కనెక్ట్ అవ్వడంతో  కిష్కింధపురిని పెద్దగా పట్టించుకోలేకపోయారు. కానీ, సినిమా చూసిన ఆడియన్స్.. అసలైన మౌత్ టాక్, రెండో రోజు బయటకి వచ్చింది. సినిమా చూడటానికి ప్రేక్షకుల సంఖ్య మరింత పెరుగుతూ సత్తా చాటుకుంటుంది. ఈ క్రమంలోనే వసూళ్లు సైతం పెరుగుతూ వస్తున్నాయి. 

అందుకు ఉదాహరణగా గమనిస్తే.. గురువారం ప్రీమియర్స్ షోలకి 17.54K పైగా టికెట్లు బుక్ అవ్వగా, రిలీజ్ రోజైన శుక్రవారం 49.27K, శనివారం 73 వేలకి పైగా బుకింగ్స్ జరిగాయి. ఈ లెక్కన చూసుకుంటే ఇవాళ ఆదివారం మరింత బుకింగ్స్ జరిగే అవకాశం ఉందని ట్రేడ్ నిపుణులు భావిస్తున్నారు.

ఈ సందర్భంగా మేకర్స్ ట్వీట్ చేస్తూ.. “రెండో రోజు అసలైన మౌత్ టాక్ బయటకి వచ్చింది, ఇప్పుడు నిజమైన విజయం దక్కింది. కిష్కింధపురి 2వ రోజు వసూళ్లు అద్భుతంగా ఉన్నాయి. మౌత్ టాక్ తో పాటు రెట్టింపు కలెక్షన్లు. మీ దగ్గరలోని సినిమా థియేటర్లలో థ్రిల్లింగ్ బ్లాక్‌బస్టర్ కిష్కింధపురిని చూసి ఎంజాయ్ చేయండి’’ అని పోస్టర్ రిలీజ్ చేశారు.

అయితే, కంటెంట్ బాగుంటే.. ఒకరోజు ఆలస్యమైనా, అసలైన టాక్ బయటకి వస్తుంది. ఇదే విషయాన్నీ కిష్కింధపురి నిరూపించుకుంది. ఎందుకంటే, కంటెంట్ ఉన్న సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఏ మాత్రం మిస్ చేసుకోరు. రికార్డులు బద్దలు కొట్టే వరకు విడిచిపెట్టరు కూడా. ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజన్లు సైతం తమ రివ్యూస్ ని షేర్ చేస్తూ వస్తున్నారు.

అందులో ఓ నెటిజన్.. 'బాక్సాఫీస్ వద్ద కిష్కింధపురి గర్జిస్తుంది. రెండవ రోజు శనివారం వసూళ్ల లెక్కలు తుఫానుగా మారాయి. మొదటిరోజు కంటే రెండో రోజు కలెక్షన్లు రెట్టింపు అయ్యాయి. ప్రేక్షకుల మౌత్ టాక్ తో వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉందని' ట్వీట్ ఇంకొంత మంది నెటిజన్లు.. 'దూకుడు పెంచిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్, రోజురోజుకూ రెట్టింపు వసూళ్లతో బాక్సాఫీస్ షేక్' అని నెటిజన్లు ట్వీట్స్ పెడుతున్నారు. దీన్ని బట్టి చూస్తే కిష్కింధపురి ఇంకో 10 రోజులు బాక్సాఫీస్ దగ్గర పాతుకుని పోవడం ఖాయమని క్రిటిక్స్ సైతం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.