
భాద్రపద అమావాస్య అంటే.. సెప్టెంబర్ 21 ఆదివారంన వచ్చే అమావాస్యని మహాలయ అమావాస్య అని పిలుస్తారు. ఆ రోజు ఎంతో పవర్ ఫుల్ డే అని పండితులు చెబుతున్నారు. ఆపర్వదినాన శివుడితో పాటు పితృదేవతలను పూజిస్తారు.బాధ్రపదమాసం అమావాస్య రోజు శివుడిని పూజించడం వల్ల అన్ని సమస్యలు దూరమై జీవితంలో గుర్తింపు, పేరు ప్రఖ్యాతలు పొందుతారని శాస్త్రాలు చెబుతున్నాయి.
ప్రతి ఏటా భాద్రపద మాసంలో వచ్చే అమావాస్యకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఆ అమావాస్య రోజు ( సెప్టెంబర్ 21) పితృదేవతలకు తర్పణాలు సమర్పిస్తారు. పండితులు తెలిపిన వివరాల ప్రకారం అమావాస్య ఆదివారంనాడు వచ్చిదంటే చాలా పవర్ ఫుల్ రోజని చెబుతారు. ఆరోజు చేసే పూజలకు.. దానాలకు విశేషంగా ఫలితం ఉంటుందని శాస్త్రాల ద్వారా తెలుస్తుంది. ఇక జీవనదుల్లో స్నానాలు చేస్తే మిగిలిన రోజుల్లో లభించే ప్రతి ఫలం కన్నా 116 రెట్లు అధికంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు.
ఈ ఏడాది ( 2025) మహాయ అమావాస్య ఆదివారం సెప్టెంబర్ 21 వచ్చింది. అందుకే పితృ దేవతలను అర్చించి.. వారికి తర్పణాలు.. పిండప్రదానం చేయడం వంటి కార్యక్రమాలు చేయాలని పండితులు చెబుతున్నారు. వారసులు ఇచ్చిన ఆహారాన్ని తీసుకొని ఆశీర్వదించి.. పితృదోషాలను తొలగిస్తారు. అందుకే ఆ రోజున ( సెప్టెంబర్ 21) ఏడు తరాల పూర్వీకులను.. గురువును.. పూజించి వారికి అర్ఘ్యాలు వదులుతారు.
ఆ రోజు అలా పితృ దేవతలను పూజించి.. పిండ ప్రదానం చేస్తే పితృదేవతల పాపాలు తొలగిపోవడమే కాకుండా వారి వారసులకు ఆరోగ్యం, సంపద, శ్రేయస్సు కలుగుతుంది. పుణ్యక్షేత్రాలు సందర్శించి, పవిత్ర స్నానాలు, యాగాలు చేసి, ఉపవాసం ఉండటం వల్ల కూడా పాపాల నుంచి విముక్తి పొందవచ్చని పురాణాల ద్వారా తెలుస్తుంది.
శివుడినే కాదు భాద్రపద అమావాస్య నాడు విష్ణుమూర్తిని కూడా ప్రత్యేకంగా పూజిస్తారు. ఈ అమావాస్య రోజు విష్ణువుని పూజిస్తే మానసిక ప్రశాంతత, శారీరక ఆరోగ్యం, ఆర్థికంగా మెరుగైన ఫలితాలు పొందుతారు. గతించిన కుటుంబ సభ్యులకు మహాలయ అమావాస్య రోజు ( సెప్టెంబర్ 21) పూజలు చేయడం వల్ల వాళ్లు ప్రశాంతత పొంది... వాళ్ల ఆత్మ శాంతిస్తుంది.
శాస్త్రాల ప్రకారం పితృ దేవతలకు మహాలయ అమావాస్య ప్రత్యేకం.అమావాస్య రోజులలో చనిపోయిన వాళ్ల పేరు మీద పూజలు నిర్వహించాలి. అందులోను ఆదివారం వచ్చిదంటే చాలా విశేషమని పండితులు చెబుతున్నారు. ఇక సంవత్సరానికి ఒకసారి వచ్చే మహాలయ అమావాస్య నాడు తప్పనిసరిగా పితృ దేవతల్ని ఆరాధించాలి. శ్రద్ధగా శ్రాద్ధ క్రియ చేయటంతో పాటూ నువ్వుల నీటితో తర్పణాలు విడవాలి. అప్పుడే వాళ్లు సంతోషించి మనకు రక్షణ, శుభాలు కలిగిస్తారు...