
- కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల, వెలుగు: సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం తన ఛాంబర్ లో డీసీపీ భాస్కర్‌తో కలిసి దండేపల్లి మండలం దమ్మన్నపేట గ్రామ గిరిజనులతో మాట్లాడారు. ఈ నెల 12న దమ్మన్నపేట, మామిడిగూడ గ్రామాల్లో జరిగిన ఘటనపై స్పందిస్తూ సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా సామరస్యంతో ముందుకు వెళ్లాలని సూచించారు.
అటవీ ప్రాంతాల్లో కమ్యూనిటీ ఫారెస్ట్ మేనేజ్మెంట్ కింద గిరిజనులను వెదురు సాగుకు ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. గుంతలు తవ్వడం, మొక్కలకు నీరు అందించడం, యూరియా కొనుగోలు, ఇతర పనులకు నిధులు మంజూరు చేస్తామన్నారు. వెదురు విక్రయించుకుని ఆదాయం పొందేందుకు అవకాశం కల్పిస్తామని తెలిపారు. గిరిజనుల సమస్యల పరిష్కారానికి అధికార యంత్రాంగం సిద్ధంగా ఉంటుందని, భౌతిక దాడులకు పాల్పడవద్దని సూచించారు.