రూ. 2 వేల నోట్ల ఎక్స్చేంజ్​ బుధవారం నుంచి మొదలు

రూ. 2 వేల నోట్ల ఎక్స్చేంజ్​ బుధవారం నుంచి మొదలు

న్యూఢిల్లీ: రెండు వేల నోటు ఎక్స్చేంజ్​ మంగళవారం నుంచి మొదలవడంతో కొన్ని బ్యాంకుల వద్ద చిన్నపాటి క్యూలు కనిపించాయి.  ఎలాంటి ఐడెంటిటీ ప్రూఫ్​ అవసరం లేదని ఆర్​బీఐ, ఎస్​బీఐలు ప్రకటించినప్పటికీ, కొన్ని బ్యాంకులు మాత్రం పాన్​ లేదా ఆధార్​ తప్పనిసరిగా కావాలని పట్టుబట్టాయి. రూ. 2,000 నోట్ల ఎక్స్చేంజ్​కి సెప్టెంబర్ చివరిదాకా గడువు ఉంది. కొన్ని బ్యాంకులు ఎలక్ట్రానిక్​ ఎంట్రీ ద్వారా నోట్లను తీసుకోగా, మరికొన్ని బ్యాంకులు ఐడీ ప్రూఫ్​ అడగకపోయినా,  కస్టమర్లను తమ పేరు, మొబైల్​ నెంబర్లను  ఇవ్వాలని కోరాయి.  

మొత్తం కరెన్సీలో రూ. 2,000 నోట్లు 10.8 శాతం. విలువపరంగా రూ. 3.6 లక్షల కోట్లు. రూ. 2 వేల నోట్ల ఎక్స్చేంజ్​ లేదా డిపాజిట్​కు ఎలాంటి ఐడీ ప్రూఫ్​ అవసరం లేదని తన బ్రాంచీలన్నింటికీ ఎస్​బీఐ సమాచారం పంపింది. కొటక్​, హెచ్​ఎస్​బీసీ వంటి బ్యాంకులు తమ వద్ద అకౌంట్లు లేని వారిని  ఐడీ ప్రూఫ్​  ఇవ్వాలని కోరాయి. ఫార్మ్​ నింపాల్సిన ​ అవసరం లేదని నాన్​ అకౌంట్​ హోల్డర్లయితే మాత్రం ఏదో ఒక ఐడీ ప్రూఫ్​ ఇవ్వాలని బ్యాంక్​ ఆఫ్​ బరోడా కోరుతోంది. ఇక ఐసీఐసీఐ, హెచ్​డీఎఫ్​సీ బ్యాంకులు తమ కస్టమర్లందరూ ఫార్మ్​లు నింపాలని, కస్టమర్లు కాకపోతే ఐడీ ప్రూఫ్​ ఇవ్వాలని కోరుతున్నాయి.