హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్ జోన్ సీడీ-6 చార్మినార్ పరిధిలో 31 మంది కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతులు లభించాయి. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ సి. హరికిరణ్ ఆదేశాల మేరకు హైదరాబాద్ జోన్ డిప్యూటీ కమిషనర్ అనిల్ కుమార్ రెడ్డి ఈ పదోన్నతులను ఇచ్చారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలకు చెందిన అర్హత కలిగిన కానిస్టేబుళ్లు ఈ పదోన్నతుల ఉత్వర్వులు అందుకున్నారు. సీడీ-6 చార్మినార్ జోన్‌లో మొత్తం 155 హెడ్ కానిస్టేబుల్ పోస్టులు ఉండగా, ప్రస్తుతం 124 మంది మాత్రమే పనిచేస్తున్నారు. ఖాళీగా ఉన్న 31 పోస్టులను భర్తీ చేస్తూ అర్హులైన కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతులు కల్పించారు.
