హైదరాబాద్ సిటీ, వెలుగు: కిరాయి ఇంట్లో గంజాయి వ్యాపారం చేస్తున్న ఇద్దరిని ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ ధూల్‌పేట్‌కు చెందిన ముస్తఫా హుస్సేన్, ఇస్లీ కవిత కలిసి ఫతేనగర్ వడ్డెర బస్తీలో ఒక ఇంటిని అద్దెకు తీసుకొని గంజాయి అమ్ముతున్నారు. పక్కా సమాచారంతో వీరిని బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. 1.50 కిలోల గంజాయి. రెండు సెల్ఫోన్లు, రూ.7 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.
వీరు ధూల్‌పేట్‌కు చెందిన గాయత్రి, వరలక్ష్మి అలియాస్ వరమ్మ వద్ద రూ.11వేలకు కిలో గంజాయిని కొనుగోలు చేసి అమ్ముతున్నట్లు గుర్తించారు. వీరిద్దరు పరారీలో ఉన్నట్లు ఎక్సైజ్ సీఐ తెలిపారు. కవితపై గతంలో గంజాయి, తహసీల్దార్ వద్ద బైండోవర్ కేసులు ఉన్నాయి. అయినా అమ్మకాలు నిలిపివేయకుండా తరుచూఎక్సైజ్ పోలీసులకు పట్టుబడడంతో ఈ మధ్యనే రూ. 9 లక్షల జరిమానా విధించారు. అయి నా తీరు మార్చుకోకుండా మళ్లీ గంజాయి అమ్ముతున్నట్లు మేడ్చల్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ తెలిపారు.

