
అసలే ఐటీ ఉద్యోగులు.. ఆపై వీకెండ్, అందులోనూ ఫ్రెండ్ బర్త్ డే పార్టీ.. ఇంకేముంది, చిల్ అవుదామని ఫామ్ హౌస్ లో పార్టీ ప్లాన్ చేశారు. కాస్ట్లీ మందు బాటిళ్లు, డ్రగ్స్ తో పకడ్బందీగా పార్టీ ప్లాన్ చేశారు. అలా ఐటీ ఉద్యోగులు ఫుల్ జోష్ తో పార్టీ ఎంజాయ్ చేస్తుండగా సీన్లోకి పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. ఎక్సయిజ్ పోలీసులు ఫామ్ హౌస్ పై దాడి పార్టీ భగ్నం చేశారు. శనివారం ( ఆగస్టు 2 ) అర్థరాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్ శివారులోని మొయినాబాద్ లో ఉన్న ఓ ఫామ్ హౌస్ పై దాడి చేశారు ఎక్సైజ్ పోలీసులు.
డ్రగ్స్ పార్టీ నిర్వహిస్తున్న ఆరుగురు ఐటీ ఉద్యోగులను అరెస్ట్ చేశారు పోలీసులు. స్నేహితుడి బర్త్ డే పార్టీలో ఎల్ ఎస్ డీ బాటిళ్లు, హాష్ ఆయిల్, మద్యంతో పార్టీలో చిల్ అవుతుండగా దాడి చేసిన పోలీసులు ఐటీ ఉద్యోగులను అదుపులోకి తీసుకున్నారు. వారి దగ్గర నుంచి 3 ఖరీదైన కార్లు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ పార్టీ గురించి పక్కా సమాచారం అందుకున్న ఎక్స్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు మొయినాబాద్ లోని ఫామ్ హౌజ్ పై దాడి చేశారు.
డ్రగ్స్ ను హిమాచల్ ప్రదేశ్ నుంచి తీసుకు వచ్చి పార్టీ నిర్వహిస్తున్నట్టు గుర్తించిన ఎక్సైజ్ పోలీసులు ఏల్ఎస్ డి బ్లాట్స్, హష్ అయిల్ ను స్వాధీనం చేసుకున్నారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు పోలీసులు.