
జాతీయ పురస్కారం అందుకున్న నటుడు విక్రాంత్ మాస్సే, బాలీవుడ్ డెబ్యూటెంట్ శనయా కపూర్ నటించిన చిత్రం 'ఆంఖో కి గుస్తాఖియాన్'. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ప్రముఖ రచయిత రస్కిన్ బాండ్ కథ "The Eyes Have It" ఆధారంగా దీనిని రూపొందించారు. ఈ చిత్రం, సెప్టెంబర్ 5 నుంచి జీ5 (ZEE5) లో స్ట్రీమింగ్ కానుంది.
'ట్వెల్త్ ఫెయిల్'తో ఉత్తమ నటుడిగా జాతీయ పురస్కారం పొందిన విక్రాంత్ మాస్సే, ఈ సినిమాలో ఒక అంధ సంగీతకారుడి పాత్రలో అద్భుతంగా నటించారు. అదే విధంగా, శనయా కపూర్ తన తొలి చిత్రంలోనే ఒక థియేటర్ ఆర్టిస్ట్ పాత్రలో ఆకట్టుకుంది. ఈ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ, వారి భావోద్వేగభరితమైన ప్రేమకథ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఒక ప్రయాణంలో కలుసుకున్న వీరి జీవితాలు ఎలా ముడిపడ్డాయి, వారి మధ్య ఉన్న మలుపులు, ప్రేమ లోతును ఈ సినిమా చూపిస్తుంది.
ALSO READ : 'త్రిబాణధారి బార్బరిక్' బంపర్ ఆఫర్..
దర్శకుడు సంతోష్ సింగ్, రస్కిన్ బాండ్ కథలోని సారాంశాన్ని, సస్పెన్స్ ఎలిమెంట్స్‌ను చెక్కు చెదరకుండా తెరపైకి తీసుకొచ్చారు. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఆశించినంత విజయం సాధించలేకపోయినా, విమర్శకుల నుంచి మాత్రం మంచి మార్కులే పొందింది. ముఖ్యంగా విక్రాంత్ మాస్సే నటనను, శనయా కపూర్ డెబ్యూ పర్ఫార్మెన్స్‌ను ఎంతోమంది కొనియాడారు. సినిమాలోని మ్యూజిక్, కథనం యూత్‌ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ గౌరవ్ దేసై, సంగీత ప్రియులను అలరించేలా ట్యూన్స్‌ను అందించారు.
'ఆంఖో కి గుస్తాఖియాన్' అనేది కేవలం ఒక ప్రేమ కథ కాదు, ఇది ఒక ఆత్మపరిశీలన యాత్ర. చూపుకు మించి మనసులో ఉన్న భావాలకు ప్రాధాన్యత ఇస్తుంది. హృదయానికి హత్తుకునే కథలు, అద్భుతమైన నటనలను ఇష్టపడే ప్రేక్షకులకు ఇది మంచి సినిమా అవుతుంది. ఈ చిత్రం ఓటీటీలో విడుదలవడం వల్ల మరింతమంది ప్రేక్షకులకు చేరువయ్యే అవకాశం ఉంది.