Tribanadhari Barbaric: 'త్రిబాణధారి బార్బరిక్' బంపర్ ఆఫర్.. గ్రాండ్ పేరెంట్స్‌కి ఉచితంగా సినిమా టికెట్స్!

 Tribanadhari Barbaric: 'త్రిబాణధారి బార్బరిక్' బంపర్ ఆఫర్.. గ్రాండ్ పేరెంట్స్‌కి ఉచితంగా సినిమా టికెట్స్!

‘త్రిబాణధారి బార్బరిక్‌’.. థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న కొత్త సినిమా. ఇందులో సత్యరాజ్, ఉదయభాను, వశిష్ఠ ఎన్‌. సింహా, సత్యం రాజేశ్ వంటి ప్రముఖ నటీనటులు నటించారు. ఇటీవల కొన్ని పెయిడ్ ప్రీమియర్ల ద్వారా సినిమా గురించి మంచి టాక్ ను అందుకుంది.  ఆగస్టు 29న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. ముఖ్యంగా, దీనిలోని సస్పెన్స్, థ్రిల్లింగ్ అంశాలతో పాటు కుటుంబ విలువలు, భావోద్వేగాలు ఫ్యామిలీ ఆడియెన్స్ కు బాగా కనెక్ట్ అవుతోంది. 

దర్శకుడు మోహన్ శ్రీ వత్స రూపొందించిన ఈ చిత్రానికి స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పకులుగా వ్యవహరిస్తుండగా, విజయ్ పాల్ రెడ్డి అడిదల నిర్మించారు. ఈ సినిమా ముఖ్యంగా ఆడపిల్లలు ఉన్న ప్రతి కుటుంబం చూడాల్సిన సినిమా అని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. దీంతో మేకర్స్ ఒక వినూత్నమైన ఆఫర్‌ను ప్రకటించారు. తాతా మనవరాలి కథ నేపథ్యంలో సాగే ఈ సినిమా, గ్రాండ్ పేరెంట్స్‌కి ప్రత్యేక గౌరవం ఇచ్చే విధంగా ఈ ఆఫర్‌ను తీసుకొచ్చారు.  ఈ కథ అంతా కూడా తాత, మనవరాలి చుట్టూనే తిరుగుతూ సమాజానికి ఓ మంచి సందేశాన్ని ఇస్తుందని తెలిపారు.

►ALSO READ | Chiranjeevi : మెగాస్టార్ కోసం ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన మహిళ.. షాకింగ్ గిఫ్ట్ ఇచ్చిన చిరు!

సెప్టెంబర్ 7న గ్రాండ్ పేరెంట్స్ డే సందర్భంగా, 'త్రిబాణధారి బార్బరిక్‌' చిత్ర బృందం ఆగస్ట్ 30, 31 తేదీలలో ప్రదర్శించే సాయంత్రం ఆటలకు తాత, నానమ్మ లేదా అమ్మమ్మలకు ఉచిత ప్రవేశం కల్పించనున్నట్లు ప్రకటించారు. ఒక కుటుంబం నుంచి నలుగురు వెళితే, అందులో ఇద్దరు గ్రాండ్ పేరెంట్స్‌కి ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఇది సినిమాకు మరింత ప్రచారం కల్పించడంతో పాటు, కుటుంబ బంధాలకు ప్రాధాన్యత ఇచ్చే చిత్రంగా ఈ సినిమాను నిలిపింది. ఈ ఆఫర్ ద్వారా గ్రాండ్ పేరెంట్స్‌ని థియేటర్లకు రప్పించి, వారి మనసుల్ని కదిలించేలా ఈ చిత్రాన్ని చూడాలని మేకర్స్ కోరుకుంటున్నారు.