ఉత్కంఠగా నిఖిల్ ‘స్పై’ మూవీ ట్రైలర్

ఉత్కంఠగా నిఖిల్  ‘స్పై’ మూవీ ట్రైలర్

యంగ్ హీరో నిఖిల్(Nikhil) నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'స్పై'(Spy). ఈ మూవీ నుంచి ఇటీవల టీజర్ విడుదలై మంచి రెస్పాన్స్ దక్కించుకోంది. 
తాజాగా ‘స్పై’ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. స్వాతంత్య్ర  సమరయోధుడు నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌(SubhasChandraBose) మరణం వెనుక దాగిన రహస్యాల ఆధారంగా రూపొందిన ఈ మూవీ ట్రైలర్ ప్రేక్షకులని వీపరీతంగా ఆకట్టుకుంటుంది.ట్రైలర్ లో 'చరిత్ర మనకి ఎప్పుడు నిజం చెప్పదు..దాస్తుంది అంటూ నిఖిల్ చెప్పిన డైలాగ్ ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటుంది. స్పై ఏజెంట్ గా కనిపించిన నిఖిల్ చేసిన యాక్షన్ సీన్స్ ఈ మూవీకి హైలెట్ గా కనిపిస్తోంది. ట్రైలర్ చివర్లో ఎంట్రీ ఇచ్చినా రానా  ‘స్పై’ మూవీ పై మరింత అంచనాలు పెంచేశాడు. 

క్షణం, గూఢచారి చిత్రాలకి ఎడిటర్ గా పనిచేసిన గ్యారీ బీహెచ్(Garry BH) 'స్పై’ మూవీ ని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ మూవీ లో నిఖిల్ సరసన ఐశ్యర్య మీనన్(Iswarya Menon),సాన్య థాకూర్(sanya thakur) నటించారు. ఈ మూవీకి శ్రీచరణ్ పాకాల, విశాల్ చంద్రశేఖర్(Vishal chandrashekar) సంగీతం అందించారు. ఆర్యన్ రాజేశ్(Aryan rajesh), అభినవ్ గోమటం(Abinav Gomatam) కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీకి  కే.రాజశేఖర్ రెడ్డి( K Raja Shekhar Reddy) కథని అందిస్తూ స్వయంగా ED ఎంటెర్టైన్మెంట్స్(Ed Entertinements) పతాకంపై నిర్మిస్తున్నాడు.