
న్యూఢిల్లీ: కరోనా ట్రేసింగ్ కోసం తీసుకొచ్చిన ఆరోగ్య సేతు యాప్‌ను వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో కూడా వాడుకోవాలని కేంద్రం నిర్ణయించింది. ఈ యాప్‌లో సెల్ఫ్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం ద్వారా నిర్ణీత సమూహాలకు వ్యాక్సినేషన్ చేయాలని, తద్వారా 27 కోట్ల మందికి టీకా వేసే లక్ష్యాన్ని చేరుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆరోగ్య సేతు యాప్‌లో వ్యాక్సినేషన్ ఎన్‌రోల్‌మెంట్ చేసుకునేలా నిర్ణీత గ్రూప్స్‌కు కొన్ని అవకాశం కల్పించనున్నారు. ఈ విషయాన్ని ఎంపవర్డ్ గ్రూప్ ఆన్ టెక్నాలజీ అండ్ డేటా మేనేజ్‌మెంట్ కంబాట్ కొవిడ్-19 చైర్మన్ డాక్టర్ రామ్ సేవక్ శర్మ తెలిపారు. ఆరోగ్య సేతు యాప్ ద్వారా వ్యాక్సినేషన్‌కు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చునని వ్యాక్సిన్ అడ్మినిస్ట్రేషన్‌కు నేషనల్ ఎక్స్‌పర్ట్‌గా కూడా వ్యవహరిస్తున్న రామ్ సేవక్ చెప్పారు. వ్యాక్సినేషన్‌కు హాజరయ్యే వారు తమకు అనుగుణంగా ఉన్న సమయంలో ఏ తేదీన టీకా వేయించుకోవాలి లాంటి వివరాలతో ఆరోగ్య సేతులో రిజిస్టర్ చేసుకోవాలన్నారు. సెల్ఫ్ రిజిస్ట్రేషన్ కోసం మల్టీపుల్ ఆప్షన్స్ ఇస్తున్నామని వివరించారు. టీకా వేయించుకున్నాక వారికి పోస్ట్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లు జారీ చేస్తామన్నారు.