
భారత్ పెట్రోలియం కార్పొరేషన్(బీపీసీఎల్) జూనియర్ ఎగ్జిక్యూటివ్, అసోసియేట్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ జూన్ 27.
పోస్టులు: జూనియర్ ఎగ్జిక్యూటివ్(ఇంజినీరింగ్), అసోసియేట్ ఎగ్జిక్యూటివ్(ఇంజినీరింగ్), జూనియర్ ఎగ్జిక్యూటివ్(అకౌంట్స్), అసోసియేట్ ఎగ్జిక్యూటివ్ (క్వాలిటీ అస్యూరెన్స్), సెక్రటరీ బీపీసీఎల్.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ, బీటెక్ లేదా బీఈ, డిప్లొమా, 12వ తరగతి, పదో తరగతి, సీఏ, సంబంధిత విభాగంలో ఎంఎస్సీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. పని అనుభవం తప్పనిసరి.
వయోపరిమితి: జూనియర్ ఎగ్జిక్యూటివ్(ఇంజినీరింగ్), అసోసియేట్ ఎగ్జిక్యూటివ్(ఇంజినీరింగ్) గరిష్ట వయోపరిమితి 32 ఏండ్లు, జూనియర్ ఎగ్జిక్యూటివ్(అకౌంట్స్) 35 ఏండ్లు. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్లు ప్రారంభం: మే 28.
లాస్ట్ డేట్: జూన్ 27.
అప్లికేషన్ ఫీజు: అన్ రిజర్వ్డ్, ఓబీసీ(నాన్ క్రిమిలేయర్), ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1180. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజు లేదు.
పూర్తి వివరాలకు www.bharatpetroleum.in వెబ్ సైట్ లో సంప్రదించగలరు.
►ALSO READ | భెల్లో ఇంజినీర్ పోస్టులు.. డిగ్రీ, బీటెక్ చేసినోళ్లు అప్లై చేసుకోండి..