
భారత్ ఎలక్ట్రానిక్స్(భెల్) ట్రైనీ ఇంజినీర్, ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి అప్లికేషన్లు కోరుతున్నది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ జూన్ 15.
- పోస్టులు: 03 (ట్రైనీ ఇంజినీర్), 02 (ప్రాజెక్ట్ ఇంజినీర్).
- ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఈ లేదా బీటెక్ లేదా నాలుగేండ్ల బీఎస్సీ ఇంజినీరింగ్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
- లాస్ట్ డేట్: జూన్ 15.
- అప్లికేషన్ ఫీజు: ట్రైనీ ఇంజినీర్–1 జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు రూ.177. ప్రాజెక్ట్ ఇంజినీర్–1 జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు రూ. 477. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.
- సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. 100 మార్కులకు రాత పరీక్ష ఉంటుంది. ప్రతి తప్పుడు సమాధానానికి పావు మార్కు కోత విధిస్తారు. జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు 35 శాతం, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు 35 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది.