అన్ని దేశాల కంటే ఇండియాలోనే పెట్రోల్ ధర తక్కువ : కొండా విశ్వేశ్వర్ రెడ్డి

అన్ని దేశాల కంటే ఇండియాలోనే పెట్రోల్ ధర తక్కువ :  కొండా విశ్వేశ్వర్ రెడ్డి

ప్రపంచంలో అన్ని దేశాల కంటే ఇండియాలోనే పెట్రోల్ ధర తక్కువని బీజేపీ నేత, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. ప్రధాని మోడీ నేతృత్వంలో దేశం ఎంతో అభివృద్ధి చెందిందని తెలిపారు. అనవసరంగా మోడీ పెట్రోల్ ధరలు పెంచారంటూ సోషల్ మీడియాలో దుష్ర్పచారం చేస్తున్నారని మండిపడ్డారు.  దేశాన్ని మోడీ ఎంతో అభివృద్ధి  చేశారని మరి తెలంగాణను కేసీఆర్ ఏం అభివృద్ధి చేశారని ప్రశ్నించారు.  కేసీఆర్ కుటుంబ పాలనను అంతం చేయాడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారని, రాష్ట్రంలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని విశ్వేశ్వర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. 

రాష్ట్రంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా బీజేపీ భారీ ప్రణాళికలు సిద్ధం చేస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం పిలుపు మేరకు మహాజన్‌ సంపర్క్‌ అభియాన్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. మహాజన్‌ సంపర్క్‌ అభియాన్‌ అంటే ప్రజలను కలిసే సమావేశమన్నారు.

సీఎం కేసీఆర్ ..  మోడీ గద్దె దింపడానికి ఇతర రాష్ట్రాలలో డబ్బు పంపిణీ చేస్తున్నారని ఆరోపించారు.  9 ఏళ్ల పరిపాలనలో మోడీ సాధించిన విజయాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్పారు.   ఇందుకోసం మే 30 నుంచి జూన్‌ 30 వరకు ‘మహాజన్‌ సంపర్క్‌ అభియాన్‌’ కార్యక్రమం చేపట్టనున్నారు.