జూన్,జులైలో పీక్​ స్టేజ్​కు కరోనా వైరస్

జూన్,జులైలో పీక్​ స్టేజ్​కు కరోనా వైరస్

దేశంలో కరోనా వైరస్ కేసులు జూన్, జులైలో పీక్ స్టేజీకి చేరుకుంటాయని ఎక్స్​పర్టులు అంచనా వేస్తున్నారు. ఆ తర్వాత కేసులు క్రమంగా తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మన దగ్గర ఇంకా ఇప్పుడిప్పుడే కరోనా పీక్ స్టేజ్​కు చేరుతోందని, అందుకే కేసుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోందని చెబుతున్నారు.

ప్రస్తుత ట్రెండ్ చూస్తే మన దేశంలో కరోనా వ్యాప్తి వచ్చే నెలలో పీక్ స్టేజీకి చేరొచ్చు. ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో కేసులు తక్కువగా నమోదవడానికి లాక్ డౌన్ విధించడమే కారణం. కానీ వ్యాధి పీక్ స్టేజీకి చేరాక క్రమంగా తగ్గుతుంది. టెస్టులు పెరగడం వల్లే కేసుల సంఖ్య పెరుగుతోంది. హాట్ స్పాట్లపై ఫోకస్ ను కొనసాగిస్తే కేసులు తగ్గుతాయి.

– రణదీప్ గులేరియా
ఎయిమ్స్ డైరెక్టర్

‘‘మన దగ్గర ఎండ ఎక్కువ.. కరోనా బతకదు’’

‘‘ఇండియన్లకు ఇమ్యూనిటీ ఎక్కువ..
మనకు వైరస్ సోకదు…’’

… జనవరి మొదట్లో వినిపించిన మాటలివి.. అప్పటికి దేశంలోకి వైరస్ ఎంటర్ కాలేదు. జనవరి 30న తొలి కేసు నమోదైంది. అప్పటి నుంచి మెల్లగా విస్తరించింది. దేశాన్ని కమ్మేసింది. ఎంతకూ వశమైతలేదు. రోజురోజుకూ విస్తరిస్తోంది. మహమ్మారిలా మారుతోంది. ఊసరవెల్లి రంగులు మార్చుకున్నట్లుగా.. తనను తాను మార్చుకుంటోంది. ఇప్పటిదాకా నమోదైన కేసులు ఒక ఎత్తయితే.. ఇకపై నమోదయ్యేవి ఒక ఎత్తని ఎక్స్​పర్టులు హెచ్చరిస్తున్నారు.  రానున్న రోజుల్లో కేసులు ఇంకా పెరిగిపోతాయని చెబుతున్నారు. మందులేని మహమ్మారితో.. మాస్క్​లతోనే కొట్లాడాలని, జాగ్రత్తలతోనే కంట్రోల్ చేయాలని సూచిస్తున్నారు