కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తన కామెంట్స్‌‌‌‌‌‌‌‌ను వెనక్కి తీసుకోవాలి

కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తన కామెంట్స్‌‌‌‌‌‌‌‌ను వెనక్కి తీసుకోవాలి
  • ఓయూ జేఏసీ నాయకులు, బహుజన విద్యార్థి సంఘాలు

ఓయూ, వెలుగు: రాజ్యాంగాన్ని మార్చాలని కామెంట్స్ చేస్తున్న టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ ప్రజాప్రతినిధులను ఎక్కడికక్కడ నిలదీయాలని బహుజన విద్యార్థి సంఘాల లీడర్లు, ఓయూ జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. దళిత బ్రాండ్‌‌‌‌‌‌‌‌పై గెలిచిన టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, క్రాంతి కిరణ్, గువ్వల బాలరాజులను తరిమికొట్టాలన్నారు. వీరంతా రాజ్యాంగ ద్రోహులని చెప్పారు. గురువారం  ఓయూ ఆర్ట్స్​కాలేజీ వద్ద నిరసన చేపట్టారు.- ప్రజాసమస్యల పరిష్కారంలో టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ ప్రభుత్వం  పూర్తిగా విఫలమైందని బహుజన స్టూడెంట్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వేల్పుల సంజయ్, ఓయూ జేఏసీ చైర్మన్ కొత్తపల్లి తిరుపతి అన్నారు. కాళేశ్వరం కాంట్రాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మేఘా కంపెనీ అవినీతి, నీటిపారుదల శాఖ స్పెషల్ సెక్రటరీ ఐఏఎస్ రజత్ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై వచ్చిన అవినీతి ఆరోపణల నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికే  కొత్త రాజ్యాంగం అంశాన్ని ముందుకు  తెచ్చారని ఆరోపించారు. తన కామెంట్స్‌‌‌‌‌‌‌‌ను కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెనక్కి తీసుకొని ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేశారు. గదరాజు జోషి, శ్రీనివాస్ గౌడ్, కొండల్, భాస్కర్, కుమార్, రాజు, శివ, సందీప్, ఆంజనేయులు, మహేశ్‌‌‌‌‌‌‌‌ తదితరులు పాల్గొన్నారు.