కాలు, చేయిని మళ్లీ పుట్టించొచ్చు.. చైనాలో సైంటిస్టుల ప్రయోగాలు

కాలు, చేయిని మళ్లీ పుట్టించొచ్చు.. చైనాలో సైంటిస్టుల ప్రయోగాలు
  • కాలు, చేయిని మళ్లీ పుట్టించొచ్చు!
  • చైనాలో సైంటిస్టుల ప్రయోగాలు
  • జింక కొమ్ముల్లో ఉన్న బ్లాస్టెమా సెల్స్​తో ఎక్స్​పరిమెంట్
  • ఎలుక తలలో ప్రవేశపెట్టిన సైంటిస్టులు
  • 45 రోజులకు ఎలుక తలపై కొమ్ము లాంటి ఆకారం
  • మనుషుల్లోనూ ఎముకల ఉత్పత్తికి చాన్స్: సైంటిస్టులు

సెంట్రల్​ డెస్క్, వెలుగు :  యాక్సిడెంట్​లో కాలు లేదా చేయి పోగొట్టుకుంటే జీవితాంతం బాధపడుతూనే ఉండాలి. లేదంటే పెట్టుడు కాలు లేదా చేతులతో పనులు చేసుకోవాల్సి ఉంటది. అయితే, ఇది కొంత ఖర్చుతో కూడుకున్న పని. డబ్బులేనోళ్లు అయితే చేతి కర్రలతోనే జీవితాంతం గడపాల్సి ఉంటుంది. పోగొట్టుకున్న చేయి లేదా కాలు మళ్లీ పుట్టేలా చేస్తే ఎలా ఉంటుంది? జింక కొమ్ములు విరిగిపోతే.. దాన్ని మళ్లీ అది పుట్టించుకుంటుంది. అదేవిధంగా, బల్లి తోక తెగిపోతే అది మళ్లీ పుడుతుంది. అలాగే, మనిషి కాలు లేదా చేయి కోల్పోతే దాన్ని మళ్లీ పుట్టించలేమా? అన్నదానిపై చైనా సైంటిస్టులు ప్రయోగాలు చేస్తున్నారు. జింక, బల్లి లాగే మనిషి కోల్పోయిన చేయి లేదా కాలును మళ్లీ పుట్టించగలమని చెబుతున్నారు. ఆ రోజులు దగ్గర్లోనే ఉన్నాయని రీసెర్చర్స్ అంటున్నారు. మనిషి బాడీలో బ్లాస్టెమా ప్రొజోనిటర్ సెల్స్ పంపించి చేయి లేదా కాలును పుట్టించే ప్రయోగాలు జరుగుతున్నాయి. జింకల శరీరంలో ఈ సెల్స్ ఉంటాయి. వాటి కొమ్ములు విరిగిపోతే మళ్లీ పుట్టించేందుకు బ్లాస్టెమా సెల్సే ఉపయోగపడుతాయి. వాటినే మనిషి బాడీలో పంపి ప్రయోగాలు చేయొచ్చని, భవిష్యత్ లో మనుషుల్లోనూ ఎముకల ఉత్పత్తికి చా న్స్ ఉందని సైంటిస్టులు అంటున్నారు. 

బ్లాస్టెమా సెల్స్ పనితీరుపై ఏడాది పాటు స్టడీ

చైనా జియాన్​లోని నార్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెస్టర్న్ పాలిటెక్నికల్ యూనివర్సిటీ సైంటిస్టులు ఈ ప్రయోగాలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన స్టడీ రిపోర్టు సైన్స్ జర్నల్​లో ప్రింట్ అయ్యింది. బ్లాస్టెమా ప్రొజోనిటర్ సెల్స్​ను ముందుగా ఎలుక తలలో ప్రవేశపెట్టారు. 45రోజుల తరువాత పరిశీలిస్తే.. జింకలో ఎలా అయితే కొమ్ములు ఉంటాయో.. అలాంటి ఆకారమే ఎలుక తలపై పుట్టుకొచ్చింది. జింక కొమ్ములు ఎలా విరుగుతాయి..? మళ్లీ ఎలా పుడుతాయి? అనేది తెలుసుకోవాలంటే.. సుమారు ఏడాదిపాటు స్టడీ చేయాల్సి ఉంటుందని సైంటిస్టులు చెబుతున్నారు. మనిషి శరీరంలోని అవయవాలను మళ్లీ పుట్టించగలమన్న కాన్ఫిడెన్స్​కు ఇదే ఉదాహరణ అని అంటున్నారు. బ్లాస్టెమా ప్రొజోనిటర్ సెల్స్​తో మనిషి శరీరంలో బోన్స్, మృదులాస్తి ఎముకలను మళ్లీ పుట్టించే చాన్స్ ఎక్కువే అని వెల్లడించారు.

కేవలం జింకల్లోనే యాక్టివ్​గా సెల్స్

జింక శరీరంలో ఉన్న స్టెమ్ సెల్స్ లోపల బ్లాస్టెమా ప్రొజోనిటర్ సెల్స్‌‌ను చైనా సైంటిస్టులు గుర్తించారు. ఈ సెల్స్ ఎప్పుడూ జింక శరీరంలోనే ఉంటాయి. ఎప్పుడైతే జింక కొమ్ములు విరగడం మొదలవుతాయో.. అప్పుడే బ్లాస్టెమా ప్రొజోనిటర్ సెల్స్ యాక్టివ్ కావడాన్ని సైంటిస్టులు గమనించారు. ఎప్పుడైతే కొమ్ము పూర్తిగా విరిగిపోతుందో.. అప్పుడు కొత్తవి పుట్టుకొచ్చే ప్రక్రియ ప్రారంభం అవుతుంది. పాలిచ్చి పోషించే చాలా జంతువుల్లో (క్షీరదాలు) సెల్ఫ్ రెన్యువల్ సెల్స్ ఉంటాయి. కానీ.. అవి జింకలో మాత్రమే ఉపయోగపడుతాయని చెబుతున్నారు. ఏడాదికోసారి జింక కొమ్ములు కొత్తగా పుట్టుకొస్తూ ఉంటాయి అందుకే బ్లాస్టెమా ప్రొజోనిటర్ సెల్స్ యాక్టివ్ అవుతాయి. ఎలుకల్లో కూడా ఈ తరహా సెల్స్​ ఉంటాయి. పాలివ్వని జంతువుల్లో ఇవి ఉండవని చైనా సైంటిస్టులు చెబుతున్నారు.