ఈ సీజన్ లో కచ్చితంగా ఈ డైట్‌‌ ఫాలో అవ్వాలి

ఈ సీజన్ లో కచ్చితంగా ఈ డైట్‌‌ ఫాలో అవ్వాలి

ప్రతి సీజన్‌‌లో కొన్ని హెల్త్‌‌ ప్రాబ్లమ్స్ కామన్‌‌గా వస్తుంటాయి. వాటినుంచి కాపాడుకోవాలంటే కొన్ని ఫుడ్‌‌ ఐటమ్స్‌‌ తప్పనిసరిగా తినాలి. రెగ్యులర్‌‌‌‌గా హెల్త్‌‌ ప్రాబ్లమ్స్‌‌ ఫేస్‌‌ చేసేవాళ్లు కచ్చితంగా ఈ డైట్‌‌ ఫాలో అవ్వాలి. వర్షాకాలంలో కూడా కొన్ని ఐటమ్స్‌‌ కచ్చితంగా తీసుకోవాలంటున్నారు హెల్త్‌‌ ఎక్స్‌‌పర్ట్స్‌‌.

  • ఏ సీజన్‌‌లో అయినా తప్పకుండా ఉండాల్సింది లెమన్‌‌. నిమ్మకాయలో ఉండే విటమిన్‌‌ సి ఇమ్యూనిటీ బూస్టర్‌‌‌‌గా పనిచేస్తుంది. వర్షాకాలంలో వచ్చే జలుబు, దగ్గు, వైరల్‌‌ ఫీవర్‌‌‌‌ వంటివి అటాక్‌‌ అవ్వకుండా నిమ్మకాయను ఏదో ఒక రూపంలో తీసుకోవాలి.
  • కాకరకాయను ఈ సీజన్‌‌లో వారానికి ఒకసారైనా వండుకోవాలి. ఇది యాంటీ వైరల్‌‌గా పనిచేస్తుంది. బ్యాక్టీరియా, వైరస్‌‌ను ఎదుర్కోవడంలో ఉపయోగపడుతుంది.
  • అల్లం–వెల్లుల్లిని కూడా వంటల్లో రెగ్యులర్‌‌‌‌గా వాడుకోవాలి. వీటిలో యాంటీ సెప్టిక్‌‌, యాంటీ మైక్రోబయాల్‌‌, యాంటీ బయాటిక్‌‌ గుణాలు ఎక్కువ. ఇవి రక్తంలో టి–సెల్స్‌‌ సంఖ్యను పెంచుతాయి. వ్యాధిని ఎదుర్కోవడంలో వీటి పాత్ర చాలా ముఖ్యం.
  • ప్రోబయాటిక్స్‌‌ ఉండే ఫుడ్‌‌ కూడా ఎక్కువగా తీసుకోవాలి. పెరుగు, పుల్లటి మజ్జిగ, యోగర్ట్‌‌ వంటివి రోజూ తీసుకోవాలి. నిల్వ పచ్చళ్లలో కూడా ప్రోబయాటిక్స్‌‌ ఉంటాయి. అప్పుడప్పుడు పచ్చళ్లు తినడం కూడా మంచిది. ప్రోబయాటిక్స్‌‌ పేగుల్లో మంచి బ్యాక్టీరియా పెరిగేందుకు ఉపయోగపడతాయి. దీనివల్ల డైజెషన్‌‌ సిస్టమ్‌‌ బాగుంటుంది.