
మెహిదీపట్నం, వెలుగు: గోల్కొండ ఏరియా హాస్పిటల్లో ఓ బాలింతకు గడువు ముగిసిన కిట్లను అందజేశారు. దీంతో బాధితులు హాస్పిటల్లో ప్రశ్నించగా, స్పందించకపోవడంతో స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇన్స్ పెక్టర్ సైదులు కథనం ప్రకారం.. గోల్కొండ ప్రాంతానికి చెందిన రాహుల్ శర్మ భార్య బిడ్డకు జన్మనిచ్చింది. ఈ క్రమంలో బాలింతకు మంగళవారం గోల్కొండ ఏరియా ఆసుపత్రిలో మందుల కిట్ ను అందజేశారు.
ఈ కిట్ఎక్స్ పైరీ కావడంతో ఇదేంటని బాధితుడు ప్రశ్నించాడు. హాస్పిటల్కు నుంచి సరైన సమాధానం రాకపోవడంతో స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయమై హాస్పిటల్సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్ ను వివరణ కోరగా, తమ సిబ్బంది పీఎస్కు వెళ్లి మాట్లాడినట్లు చెప్పారు. ఎక్స్పైరీ అయిన కిట్ ఒకటి వచ్చిందని, ఇదంతా పెద్ద విషయం కాదన్నారు.