ఇంటర్ ఫస్టియర్ అడ్మిషన్ల గడువు పొడిగింపు

V6 Velugu Posted on Sep 15, 2021

హైదరాబాద్: ఇంటర్మీడియట్ ఫస్టియర్ అడ్మిషన్ల గడువును మరోసారి పొడిగించారు.రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యా సంస్థలు పునః ప్రారంభమైన నేపధ్యంలో టెన్త్ పూర్తయిన విద్యార్థులు పలు కారణాలతో అడ్మిషన్లు తీసుకోలేకపోయారు. చాలా మంది అడ్మిషన్ తీసుకోవాల్సి ఉందన్న విజ్ఘప్తిపై ఇంటర్మీడియట్ బోర్డు స్పందించింది. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు జూనియర్ కాలేజీలతోపాటు గురుకుల కళాశాలల్లో కూడా అడ్మిషన్లు తీసుకునే అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నెలాఖరు వరకు అడ్మిషన్లు తీసుకునే అవకాశాన్ని కల్పిస్తూ ఇంటర్మీడియట్ బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. 
 

Tagged telangana intermediate board, inter admissions, , intermediate courses, TS interboard, intermediate first year Admissions, Deadline upto 30th september 2021

Latest Videos

Subscribe Now

More News