మా దేశ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నరు : జైశంకర్

మా దేశ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నరు : జైశంకర్

న్యూఢిల్లీ: ఇండియాలో కెనడా డిప్లమాట్ల సంఖ్యను తగ్గించడంపై విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ దేశ వ్యవహారాల్లో కెనడా అధికారులు నిరంతరం జోక్యం చేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కెనడియన్ పాలిటిక్స్ విషయంలో తమకు సమస్యలు ఉన్నాయని విమర్శించారు. దౌత్య సంబంధాల విషయంలో వియన్నా కన్వెన్షన్‌‌ను ఇండియా ఉల్లంఘించిందంటూ చేస్తున్న విమర్శలపై స్పందిస్తూ.. ‘‘వియన్నా కన్వెన్షన్‌‌లో సమానత్వం గురించి స్పష్టంగా ఉంది. 

ఇది సంబంధిత అంతర్జాతీయ నియమం కూడా. కెనడియన్ సిబ్బంది మా వ్యవహారాల్లో నిరంతర జోక్యం చేసుకుంటున్నారు. ఈ విషయంలో మాకు ఆందోళనలు ఉన్నాయి. అందుకే మేం సమానత్వాన్ని అమలు చేస్తున్నాం’’ అని స్పష్టం చేశారు. ‘‘కొంత కాలం గడిచిపోయిన తర్వాత మరిన్ని విషయాలు బయటకు వస్తాయి. మేము చేసిన వాటితో చాలా మందికి ఎందుకు అసౌకర్యం కలిగిందనేది అప్పుడు ప్రజలు అర్థం చేసుకుంటారు’’ అని అన్నారు.