ఆలయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కంటి పరీక్షలు

ఆలయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కంటి పరీక్షలు

కాశీబుగ్గ, వెలుగు : వరంగల్​ఆలయన్స్ క్లబ్ ఆఫ్ ఆధ్వర్యంలో ఆదివారం సిటీలోని డాక్టర్​-2 కాలనీలో బూర కనకయ్య కాలనీ, వీవర్స్ కాలనీల ప్రజలకు ఉచితంగా శరత్ మాక్సివిజన్ లేజర్ ఐ హాస్పిటల్, ఆపోలో ఫార్మసీ ద్వారా ఉచితంగా కంటి, షూగర్ టెస్టులను నిర్వహించారు.

ఈ సందర్భంగా 12వ డివిజన్ కార్పొరేటర్ కావటి కవిత రాజు మాట్లాడుతూ పేదలకు వివిధ రకాల ఉచిత వైద్య సేవలను అందించేందుకు ఆలయన్స్ క్లబ్ ముందు వరుసలో ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఆలయన్స్ క్లబ్ అధ్యక్షుడు నాగేందర్, క్లబ్ లీడర్స్ తదితరులున్నారు.