F2 క్లైమాక్స్ ఇలా చేశారు.. మేకింగ్ వీడియో రిలీజ్

F2 క్లైమాక్స్ ఇలా చేశారు.. మేకింగ్ వీడియో రిలీజ్

సంక్రాంతి విన్నర్ గా నిలిచింది F2 సినిమా. వెంకటేశ్ మార్క్ కామెడీ, తమన్నా అందం, దర్శకుడు అనిల్ రావిపూడి రచన హైలైట్స్ గా రూపొందిన ఈ సినిమా.. విజయవంతంగా నడుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన వీఎఫ్ఎక్స్ మేకింగ్ వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేశారు. F2 క్లైమాక్స్ ఫారిన్ లోని బ్రిడ్జీపై తీసినట్టుగా ఉంటుంది. గ్రాఫిక్స్ అని తెలిసినప్పటికీ.. ఆ సీన్స్ ను రెండు లొకేషన్స్ లో ప్లాన్ చేశారు. F2 వీఎఫ్ఎక్స్ మేకింగ్ విశేషాలు ఆసక్తికలిగించేలా ఉన్నాయి.