ఫేస్ బుక్ లో ఫొటోలు మార్పింగ్ : అమ్మాయిలకు బ్లాక్ మెయిల్

ఫేస్ బుక్ లో ఫొటోలు మార్పింగ్ : అమ్మాయిలకు బ్లాక్ మెయిల్

కష్టం చేయకుండా ఈజీగా డబ్బులు సంపాధించాలనుకున్న  ఓ యువకుడు అమ్మాయిలను ఆసరాగా చేసుకున్నాడు. ఫేస్ బుక్ లో అందంగా ఉన్న అమ్మాయిల ఫొటోలను మార్పింగ్ చేసి, వాటిని పోర్న్ సైట్లలో పెట్టడం. వాటిని ఫేస్ బుక్ లో ఉన్న అమ్మాయిలకు చూపిస్తూ బ్లాక్ మెయిల్ చేస్తాడు. వాటిని తొలగించాలంటే రూ.10వేలు అవుతాయని డబ్బులు సంపాధించడం మొదలుపెట్టాడు. మరిన్ని డబ్బులు లాగాలనే ఉద్దేశంతో పలు పోర్న్ సైట్లలో లైవ్ చాటింగ్ లో అమ్మాయిల ఫొటోలు పెట్టడం మొదలుపెట్టాడు.

వీటిని డిలేట్ చేయాలంటే ఎక్కువ మరితం ఖర్చు అవుతుందని డబ్బులు డిమాండ్ చేస్తాడు.  ఇలాగే 300 మంది యువతుల ఫోటోలను సేకరించి, మార్పింగ్ చేసి పోర్న్ వెబ్ సైట్ లో ఆఫ్ లోడ్ చేసిన వైజాగ్ కు చెందిన పాడు వినోద్ కుమార్ చివరకు పోలీసులకు దొరికాడు. ఓ అమ్మాయి ఫిర్యాదుతో కొన్ని నెలల తర్వాత ఈ ఘరాన మోసగాన్ని అరెస్ట్ చేసినట్లు తెలిపారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు. యువతులను బెదిరించి ఒక్కోక్కరి వద్ద పది వేల రూపాయలు వసూలు చేశాడని చెప్పారు. యువతులతో నిందితుడు సెక్స్ చాట్ చేసేవాడని చెప్పారు. వినోద్ కుమార్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించామని తెలిపారు పోలీసులు.