ఫేస్ బుక్ ఇండియా డైరెక్టర్ గా మాజీ ఐఏఎస్

V6 Velugu Posted on Sep 20, 2021

  • ఉన్నత స్థాయి నాయకుల బృందానికి మార్గనిర్దేశం చేయనున్న రాజీవ్ అగర్వాల్

న్యూఢిల్లీ: ఫేస్ బుక్ ఇండియా పబ్లిక్ పాలసీ విభాగం డైరెక్టర్ గా మాజీ ఐఏఎస్ అధికారి రాజీవ్ అగర్వాల్ నియమితులయ్యారు. ఈయన గతంలో ‘ఉబర్’ క్యాబ్ సేవల సంస్థలో ఎగ్జిక్యూటివ్ గా పనిచేసిన అనుభవం ఉంది. భారత దేశంలో రోజు రోజుకూ పెరుగుతున్న యూజర్లకు కట్టుదిట్టమైన భద్రత, నమ్మకం, సమాచార పరిరక్షణ, ఇంటర్నెట్ గవర్నెన్స్, వ్యక్తిగత గోప్యత, తదితర విభాగాల్లో విధానాల రూపకల్పనకు కోసం పబ్లిక్ పాలసీ విభాగానికి నేతృత్వం వహించనున్నారు. ఫేస్ బుక్ ఇండియాలోని ఉన్నత అధికారుల బృందంలో ఈయన కూడా ఒకరిగా వ్యవహరించనున్నట్లు ఫేస్ బుక్ తెలిపింది. 
 

Tagged , Facebook India, new appointments of facebook, former IAS Officer Rajiv Agarwal, facebook head of public policy

Latest Videos

Subscribe Now

More News