తాలిబన్లకు ఫేస్ బుక్ షాక్.. సపోర్ట్‌గా పోస్టులు పెట్టొద్దు

తాలిబన్లకు ఫేస్ బుక్ షాక్.. సపోర్ట్‌గా పోస్టులు పెట్టొద్దు

ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ తాలిబన్లకు షాక్ ఇచ్చింది. అఫ్గానిస్థాన్ ను కంట్రోల్ లో తెచ్చుకున్న తాలిబన్లను ఉగ్రవాదులుగా పేర్కొంది. వారికి సంబంధించిన సమాచారాన్ని తమ ప్లాట్ ఫామ్ లపై బ్యాన్ విధిస్తున్నట్లు ఫేస్ బుక్ తెలిపింది. ఫేస్ బుక్ బేస్డ్ ప్లాట్ ఫామ్స్ లో ఉన్న తాలిబన్ సంబంధిత అకౌంట్లు, పోస్టులు, వీడియోలను తొలగిస్తున్నామని స్పష్టం చేసింది. తాలిబన్లను పొగుడుతూ, సపోర్టు చేస్తూ పోస్టులు పెట్టినా వాటిని తొలగిస్తామని తెలిపింది. అమెరికా చట్టాల ప్రకారం తాలిబన్లను ఉగ్రవాదులుగా గుర్తించి, ఆ సంస్థపై ఆంక్షలు విధించి ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఫేస్‌బుక్ వెల్లడించింది. కాగా, తాలిబన్లు ఎండ్‌ టూ ఎండ్‌ ఎన్‌క్రిప్టెడ్‌ మెసేజ్‌లను పంపే వాట్సాప్‌ను నిరంతరాయంగా వాడుతున్నారు. కంపెనీ నిషేధం విధించినా వారిని అడ్డుకోలేకపోవడం గమనార్హం.