2వేల నోట్ల మార్పులు,డిపాజిట్ ఆరోజున ఉండదు

2వేల నోట్ల మార్పులు,డిపాజిట్ ఆరోజున ఉండదు

ఖాతాల వార్షిక ముగింపు కార్యకాలాలు ఉన్నందున ఏప్రిల్ 1,2024 న రూ. 2వేల నోట్ల మార్చుకునే, డిపాజిట్ చేసే సదుపాయం అందుబాటులో ఉండదు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 19 ఇష్యూ కార్యాలయాల్లో ఖాతాల ముగింపు సంబంధించిన కార్యకలాపాల కారణంగా రూ. 2వేల నోట్ల మార్పిడి/ డిపాజిట్ సౌకర్యం ఆరోజన అందుబాటులో ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. ఈ సదుపాయం 19 ఇష్యూ ఉన్న కార్యాలయాల్లో తిరిగి ప్రారంభమవుతుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది.   

మే 19, 2023 న ఆర్బీయై రూ. 2వేల డినామినేషన్ బ్యాంక్ నోట్లను రద్దు చేసిన విషయం అందరికి తెలిసిందే. ఫిబ్రవరి 29,2024న వ్యాపారం ముగిసే సమయానికి రూ. 2వేల బ్యాంకు నోట్లలో దాదాపు  97.62 శాతం తిరిగి బ్యాంకింగ్ వ్యవస్థకు చేరగా, కేవలం 8,470 కోట్లు విలువైన డ్రా మాత్రమే ప్రజల వద్ద  మిగిలి ఉంది.మిగిలిన వాటిని దేశవ్యాప్తంగా ఉన్న 19 ఆర్బీఐ కార్యాలయాల్లో  రూ.2వేల నోట్లను డిపాజిట్ చేసుకునేలా అవకాశం కల్పించింది.బ్యాంకు ఖాతాలకు క్రిడిట్ చేసుకునేందేకు ఏదేని పోస్టాఫీస్,ఆర్బీఐ ఇష్యూ కార్యాలయలకు ఇండియా పోస్ట్ ద్వారా పంపవచ్చని వెసులుబాటు కల్పించింది.సెప్టంబర్ 30,2023 లోగా మార్చుకోవాలని లేదా బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేయాలని మొదటి కోరింది. గడువు తర్వాత అక్టోబర్ 7,2023 వరకు మరోసారి పొడిగించింది. అక్టోబర్ 8 , 2023 నుంచి ఆర్బీఐ 19 ఇష్యూ కార్యాలయాల్లో కరెన్సీని మార్చుకోవడం లేదా సమానమైన మొత్తాన్ని వారి బ్యాంక ఖాతాలకు జమ చేసుకునే అవకాశం కల్పించింది.