
ఇటీవల కేంద్రం ప్రతిపాదించిన కొత్త బ్రాడ్ కాస్టింగ్ బిల్లు ముసాయిదాను వెనక్కు తీసుకుంది. ఈ బిల్లు ద్వారా ఆన్లైన్ కంటెంట్ పై నియంతృత్వ ధోరణితో వ్యవహరించేందుకు ప్రయత్నిస్తోదంటూ సర్వత్రా విమర్శలు వెల్లువెత్తిన క్రమంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కొత్త బ్రాడ్ కాస్టింగ్ బిల్లు ద్వారా వాక్ స్వాతంత్రానికి ముప్పు వాటిల్లిందని అభిప్రాయపడుతున్నారు కంటెంట్ క్రియేటర్స్. ఈ ముసాయిదా బిల్లుపై విపక్షాల నుండి కూడా పెద్దఎత్తున విమర్శలు రావడంతో వెనక్కు తగ్గిన కేంద్రం బిల్లులోని పలు నిబంధనలను సమీక్షించి సవరణ చేసి మళ్ళీ పార్లమెంటు ముందుకు తీసుకొస్తామని తెలిపింది.
2024 సార్వత్రిక ఎన్నికల్లో ఇండిపెండెంట్ కంటెంట్ క్రియేటర్స్ పోషించిన కీలక పాత్రను దృష్టిలో పెట్టుకొని వారి గొంతు నొక్కేలా ఈ ముసాయిదా బిల్లు రూపొందించారని విమర్శలు వచ్చాయి. బ్రాడ్ కాస్టింగ్ కంపెనీలతో జరిపిన క్లోజ్డ్ డోర్ చర్చలు కాకుండా పౌర సంఘాలతో చర్చలు జరపాల్సి ఉందని డిజిటల్ మీడియా సంస్థలు పేర్కొన్నాయి.ఈ నేపథ్యంలో ఈసారి డిజిటల్ మీడియా సంస్థలతోనే కౌకుండా బ్రాడ్ కాస్టింగ్ సేవలతో ముడిపడ్డ అన్ని వర్గాలతో చర్చలు జరిపేందులకు కేందం సిద్ధమవుతోందని సమాచారం.