Fact Check : రూ.5 పాతనోటుకు.. రూ.6 లక్షలా.. నిజమేనా.. సైబర్ ఉచ్చులో భాగమా

Fact Check : రూ.5 పాతనోటుకు.. రూ.6 లక్షలా.. నిజమేనా.. సైబర్ ఉచ్చులో భాగమా

అంతర్జాతీయ మార్కెట్‌లో రూ.5 నోటుకు డిమాండ్ వేగంగా పెరుగుతోంది. ఈ కారణంగా చాలా మంది పాత, చెల్లని రూ.5నోటు కోసం అన్వేషించడం ప్రారంభించడం ప్రారంభించారు. దీనికి  కారణం ఓ న్యూస్ వైరల్ కావడమే.. అదేంటంటే రూ.5 నోట్ల మార్పిడితో రూ.6 లక్షలు దక్కించుకోవచ్చట. అందుకు కొన్ని రూల్స్ కూడా ఉన్నాయంటూ ఇటీవల సోషల్ మీడియాలో ఓ వార్త తెగ హల్ చల్ చేస్తోంది. వైరల్ అవుతోన్న న్యూస్ ప్రకారం.. రూ.5నోటుతో రూ.6 లక్షలు గెలుచుకోవాలంటే నోటుపై కొన్ని గుర్తులు, నిబంధనలు ఉండలట.

అందులో మొదటిది రూ. 5నోట్‌పై సీరియల్ నంబర్ 786 అని ఉండాలి. దాంతో పాటు నోటు వెనుక భాగంలో ట్రాక్టర్, రైతు చిత్రం ఉండాలి. ఈ గుర్తులు రూ.5 నోటుపై ఉంటే ఏ పని చేయకుండానే, అత్యంత సులభంగా, ఒక్క నోటుతోనే రూ. 6 లక్షల సులభంగా సంపాదించవచ్చని ప్రచారం సాగుతోంది.

ఎక్కడ అమ్మాలంటే..

అంతా బాగానే ఉంది గానీ.. ఈ రూ.5 నోటును ఎక్కడ అమ్మాలి. ఎవరు తీసుకుంటారు అనే విషయాలు కూడా చర్చనీయాంశంగా మారాయి. అందుకు కూడా ఏం కష్టపడనక్కర్లేదట. ఇంట్లో హాయిగా కూర్చొనే దీన్ని అమ్మవచ్చట. దీని కోసం ఈ-బే సైట్‌లో నమోదు చేసుకోవాలని. అక్కడ కస్టమర్ కేర్ సహాయంతో వివరాలను పొందుపర్చి డబ్బును గెలుచుకోవచ్చట.

పైన చెప్పిన కారణాలు, నిబంధనలు అన్నీ బాగానే, నమ్మదగినవిగానే ఉన్నా దీనిపై అధికారికంగా మాత్రం ఎలాంటి ప్రకటన జారీ కాలేదు. టెక్నాలజీ పెరుగుతున్నా కొద్దీ సైబర్ నేరాలు కూడా పెరుగుతూ వస్తున్నాయి. ఈ క్రమంలో ఇలా పలు స్కీంలు, ఆఫర్లు అంటూ కొంతమంది  నేరాలకు పాల్పడుతున్నారు. అది నమ్మిన ప్రజలు మోసపోతున్నారు, లక్షల్లో డబ్బును కోల్పోతున్నారు. కాబట్టి ఏదైనా ఆఫర్ లేదా పథకాలను అమలు చేసేముందు వాటి గురించి తెలుసుకోవాలని, జాగ్రత్త వహించాలని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు.